Economy vs Rupee: భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, రూపాయి విలువ మాత్రం అమెరికా డాలర్‌తో పోలిస్తే చరిత్రలో తొలిసారిగా 90 రూపాయల మార్కుకు చేరుకుని బలహీనపడింది.
Bajaj Finance : భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ నాన్-బ్యాంకింగ్ రుణదాత మరియు బజాజ్ ఫిన్‌సర్వ్‌లో భాగమైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఈ పండుగ సీజన్‌లో వినియోగ ఫైనాన్స్‌లో పెరుగుదల కనిపించిందని, రికార్డు స్థాయిలో వినియోగదారుల రుణాలను పంపిణీ చేసిందని, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే వాల్యూమ్‌లో 27% మరియు విలువలో 29% ఎక్కువగా ఉందని ఈరోజు తెలిపింది. వినియోగ వస్తువుల కోసం రుణాల ద్వారా ప్రాతినిధ్యం వహించే వినియోగ క్రెడిట్ పెరుగుదల, వినియోగదారుల కొనుగోలు…
India US Trade: భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందంపై భారత వాణిజ్యం & పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. బెర్లిన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఎప్పుడు కూడా తొందరపడి లేదా తలపై తుపాకీ గురిపెట్టి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోదని ఆయన స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్ (EU), యునైటెడ్ స్టేట్స్ సహా, అనేక ఇతర దేశాలతో భారతదేశం వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు. READ ALSO: S-400: చైనా,…
GST 2.0 report: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు సామాన్యుడికి మేలు చేశాయని కేంద్రమంత్రులు చెప్పారు. జీఎస్టీ రిపోర్టును మీడియాతో పంచుకున్నారు. జీఎస్టీ రేటు తగ్గింపుల వల్ల తగ్గిన పన్నుల ప్రయోజనాలు దేశ ప్రజలకు అందాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్రమంతులు పియూష్ గోయల్, అశ్విని వైష్ణవ్‌లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. దసరా ముందు వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు జోరుగా సాగాయని ఆమె చెప్పారు.
UK PM: భారత ఆర్థిక వ్యవస్థ 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. భారత్ ఈ స్థాయికి చేరుకునే మార్గంలో ఉందని ఆయన అన్నారు. యూకే ప్రధాని వ్యాఖ్యలు, ట్రంప్ ‘‘డెడ్ ఎకానమీ’’ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఉన్నాయి. భారత్ ఇటీవలే జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
పండగ పూట సామాన్యుడికి శుభవార్త! దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. సామాన్యుడి నడ్డి విరుస్తున్న 12%, 28% పన్ను శ్లాబులను పూర్తిగా రద్దు చేసి, కేవలం 5%, 18% శ్లాబులను మాత్రమే కొనసాగించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని వైపుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. భారతదేశంపై ఆయన అభిప్రాయంతో సొంత దేశస్థులే అసంతృప్తి చెందుతున్నారు. ఇటీవల భారత్‌పై 25% సుంకం విధించిన భారతదేశాన్ని 'డెడ్ ఎకానమి' అంటూ ఎగతాళి చేశారు. ఇది అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకు పెద్ద తప్పుగా నిపుణులు పరిగణిస్తున్నారు. మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ టెస్ట్‌బెడ్ అధ్యక్షుడు కిర్క్ లుబిమోవ్..
PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను ‘‘డెడ్ ఎకానమీ’’గా పొల్చారు. రష్యాతో భారత సంబంధాలను ఉద్దేశిస్తూ, రెండు దేశాలు ఆర్థిక వ్యవస్థలు చనిపోయే స్థితిలో ఉన్నాయని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
Kiren Rijiju: భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సమర్థించడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ‘‘డెడ్ ఎకానమీ’’అని ట్రంప్ చెప్పడాన్ని రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. అయితే, ఈ విషయంపై కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఆయనను విమర్శించారు. ప్రతిపక్ష నేత ‘‘చిన్నపిల్లవాడు కాదు’’ అని, దేశ ప్రతిష్టను ఈ విధంగా దెబ్బతీయకూడదని తెలుసుకోవాలని హితవు పలికారు. ‘‘రాహుల్ గాంధీ దేశానికి వ్యతిరేకంగా…