ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే 2025-26 వార్షిక బడ్జెట్ పై అన్ని వర్గాలు అంచనాలు పెట్టుకున్నాయి. ఎవరికి వారు బడ్జెట్ తమ ఆశలకు అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా భారత ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న సామాన్యులు కీలక మార్పులు ఉండొచ్చని ఆశిస్తున్నారు. ధరలకు కళ్లెం పడాలని.. ఆర్ధిక భారం తగ్గాలని కోరుకుంటున్నారు.
Dollar Vs Rupee: డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. మంగళవారం నాడు రూపాయి ఏకంగా 66 పైసలు క్షీణించింది. గత రెండేళ్లలో ఇంత స్థాయిలో రూపాయి విలువ పడిపోవడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా, గతంలో 2023 ఫిబ్రవరి 6న రూపాయి 68 పైసలు తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో క్షీణించి ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద రూపాయి విలువ 86.70 స్థాయికి చేరింది. ఇది రూపాయి చరిత్రలో అతి…
Bharat Mobility Global Expo 2024: ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024ని సందర్శించి, భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఈవెంట్‌ని నిర్వహించిన ఆటోమొబైల్ పరిశ్రమను ప్రధాని అభినందించారు. ఎక్స్‌పోని పలు స్టాల్స్ తనని ఆకట్టుకున్నాయని, అయితే తాను పూర్తిగా అన్ని స్టాల్స్‌ని చూడలేకపోయానని అన్నారు. తాను ఎప్పుడూ కార్ కొనలేదని, చివరకు సైకిల్ కూడా కొనలేదని ప్రధాని అన్నారు.
UN Economic Report: భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక నివేదిక వెల్లడించింది. 2024లో కూడా భారత వృద్ధి 6.2 శాతానికి చేరుకోగలదని యూఎన్ ఆర్థిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం ప్రచురించిన వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక తెలిపింది. భారత వృద్ధి 2024లో 6.2 శాతంగా ఉంటుందని, అయితే ఇది 2023లోని 6.3 శాతంతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని యూఎన్ రిపోర్ట్ అంచనా…
భారత ఆర్థిక వ్యవస్థలో చరిత్రాత్మక వృద్ధి నమోదైంది. మొట్టమొదటిసారిగా, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లను దాటింది. దీనితో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించడానికి చాలా దగ్గరగా వచ్చింది. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి ఇది ఒక పెద్ద అడుగు.
India Growth: ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధి రేటులకు ఢోకా లేదని, భారతదేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2023లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 6.3 శాతంగా ఉంటుందని తెలిపింది. గతంలోని అంచనాలను సవరించింది. ఏప్రిల్ నెలలో ఊహించినదాని కన్నా బలమైన వినియోగాన్ని భారత మార్కెట్ లో
Indian Economy By 2027: ఐదు ట్రిలియన్ డాలర్లు... ఆర్థిక వ్యవస్థ పరంగా ఇది ఒక మైలురాయి. దీనిని ఇప్పటివరకు కొన్ని దేశాలు మాత్రమే సాధించాయి. భారతదేశం ఈ మైలురాయిని సాధించడానికి చాలా దగ్గరగా ఉంది.
Internet Economy: భారతదేశంలో శరవేగంగా డిజిటల్ విప్లవం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలిచిన భారత్, డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఇక రాబోయే కొన్నేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.
India Economy: ఈ ఆర్థిక సంవత్సరంలో ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ఎకానమీగా ఇండియా నిలవనుంది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గ్రోత్ సగటున ఏడు శాతానికి చేరుతుంది. తద్వారా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో బలమైన ఎకానమీగా ఇండియా
UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర నమోదైంది. 2022 జూలైలో 6 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 2016 తర్వాత అంటే గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం కావటం విశేషం. యూపీఐ ట్రాన్సాక్షన్లు 2019 అక్టోబర్‌లో తొలిసారి 1 బిలియన్ మార్క్‌ను దాటాయి.