Union Budget 2026: నేడే కేంద్ర బడ్జెట్.. ఆసక్తిగా చూస్తున్న దేశం..
- ఈ రోజే కేంద్ర బడ్జెట్ 2026..
- వరసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు( ఆదివారం) పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ -2026ను ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను మరింత పరుగులు పెట్టించేలా బడ్జెట్ ఉండబోతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ బడ్జెట్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ రక్షణ, మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయం, విద్యుత్, గృహనిర్మాణం, రక్షణపై బడ్జెట్ ఫోకస్ చేయనుంది. వరసగా 9వ సారి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రికార్డ్ క్రియేట్ చేశారు.
ఈ ఏడాది కేంద్రబడ్జెట్ 75 ఏళ్ల సంప్రదాయాన్ని మార్చబోతోంది. బడ్జెట్ ప్రసంగంలో పార్ట్ ఏలో ఆర్థిక పరిస్థితుల సమీక్ష, విధాన నిర్ణయాలు ఎక్కువగా ఉండేవి. అయితే, పార్ట్ బీ మాత్రం పన్నులు, సాంతకేతిక అంశాలకే పరిమితమయ్యేది. కానీ ఈ సారి మాత్రం పార్ట్ బి లోనే తక్షణ విధాన చర్యలు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నిర్మలా సీతారామన్ చర్చించనున్నారు. పార్ట్ బి ప్రసంగం ద్వారా 21వ శతాబ్ధంలో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలను దృష్టిలో పెట్టుకున్ని దేశీయ బలాలాను ఎలా వినియోగించుకోవాలి, గ్లోబల్ మార్కెట్లో భారత్‌ను మరింత పోటీగా తీర్చదిద్దాలనే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. తయారీ, వాణిజ్యం, ఎగుమతుల రంగాల్లో ప్రస్తుతం భారత్‌కు ఉన్న సామర్థ్యాలు, భవిష్యత్ అవకాశాలపై ప్రసంగం ఉండబోతోంది.
Also Read
- Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
Read Also: Suryakumar Yadav: ఫియర్ లెస్ బ్యాటింగ్.. రో-కో ను అధిగమించి T20లో కెప్టెన్ సూర్య నయా హిస్టరీ
కస్టమ్స్, ట్రేడ్ రిఫార్మ్స్ కూడా పార్ట్ బీలో ప్రధానంగా ఉండబోతున్నట్లు సమాచారం. కస్టమ్స్ డ్యూటీ పునర్వ్యవస్థీకరణ, డ్యూటీ స్లాబులను సులభం చేయడం, నిలబంధనల భారం తగ్గించడం వంటి ప్రతిపాదనలు ఉండబోతున్నాయి. దీని ద్వారా లిటిగేషన్లను తగ్గించడం, గ్లోబల్ వ్యాల్యూ చైన్‌లలో పనిచేసే కంపెనీలకు స్పష్టత కల్పించడమే లక్ష్యం ప్రభుత్వం భావిస్తోంది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్(SEZs), ఎక్స్‌పోర్ట్ ఓడియెంటెడ్ యూనిట్స్(EOUs) వంటి పథకాలను ఏకం చేసి యూనిఫైడ్ ఎక్స్‌పోర్ట్ అండ్ మానుఫ్యాక్చరింగ్ జోన్స్‌గా మార్చే ప్రతిపాదనలు పార్ట్‌బీలో ఉండనున్నాయి.
కేంద్ర బడ్జెట్ 2026 గ్రామీణాభివృద్ధి మరియు వ్యవసాయ రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచే కార్యక్రమాల కోసం ఆర్థిక మంత్రి మరిన్ని నిధులను ప్రకటించే అవకాశం ఉందని శనివారం వర్గాలు తెలిపాయి. ‘విక్సిత్ భారత్ – జి రామ్ జి’కి బడ్జెట్‌లో రూ. 1.51 లక్షల కోట్లకు, దాదాపుగా 72 శాతం పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. గతేడాది ఉపాధి హామీకి రూ. 86,000 కోట్లను కేటాయించారు.
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!