దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యం కేంద్ర హైఅలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కొవిడ్ అలర్ట్ జారీ చేసింది. కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో దేశంలో పరిస్థితి, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
దేశంలో కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పరిస్థితి, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
చైనాతో సహా ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ప్రకటించారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని ఆయన తెలిపారు.
కరోనా కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకుంటే వేరియంట్ల మీద వేరియంట్లు పుట్టుకొచ్చి భయపెడుతున్నాయి. దేశంలో తాజాగా రెండు కొత్త వేరియంట్లకు సంబంధించి కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా ఉద్ధృతి దేశంలో కాస్త తగ్గింది. కేసులు కూడా గతంతో పోలిస్తే బాగా తగ్గాయ్. అయితే ఒమిక్రాన్‌కు సంబంధించిన వేరియంట్లు ఒక్కొక్కటిగా బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని పూణేలో బీఏ4, బీఏ5 కరోనా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వీరందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.…
దేశంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదా? ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి వుందా? అంటే అవుననే అంటున్నారు డాక్టర్లు.వివిధ రకాల ఆరోగ్య ఇబ్బందులు వున్నవారు, వృద్ధులు, గుండెజబ్బులు, కిడ్నీ రోగాలు వున్నవారు ఈ ఫోర్త్ వేవ్ వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం వుంది. షుగర్ పేషెంట్లు షుగర్ కంట్రోల్ లో వుంచుకోవాలని డాక్టర్ వసీం సూచిస్తున్నారు. అలాగే, వైద్య ఆరోగ్య శాఖ (medical health department) అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అయితే అంతగా ఆందోళన చెందవద్దని…
భారతదేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది. కరోనా కేసుల తాకిడి తగ్గడంతో జనం మాస్క్ లు ధరించడం కూడా తగ్గించారు. అయితే అప్రమత్తంగానే వుండాలని వైద్యశాఖాధికారులు సూచిస్తున్నారు. దేశంలో కొత్తగా 1,260 కరోనా కేసులు నమోదయ్యాయి. 1404 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 83 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 0.03శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 0.24శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇకపోతే దేశంలో మొత్తం కేసులు-4,30,27,035గా…