కరోనా అదుపులో వున్నా అప్రమత్తంగా వుండాలని కేంద్ర ప్రభుత్వం అందరినీ జాగ్రత్తలు పాటించమంటోంది. దేశంలో తాజాగా 3 వేల లోపే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 2075 కరోనా కేసులు నమోదవగా, 71 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,30,04,005కు చేరగా, 5,16,352 మంది మరణించారు. మొత్తం కేసుల్లో 4,24,61,926 మంది బాధితులు కోలుకోగా, 27,802 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఫోర్త్ వేవ్ పై తన అభిప్రాయం తెలిపారు భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణా…
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేసింది. ఇప్పుడిప్పుడే దాని ప్రభావం తగ్గింది. కానీ అది అంతం కాలేదు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించింది. బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ (Corbevax) టీకాను అందిస్తోంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీని మరింత విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.…
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. నిన్న 5,476 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా వల్ల 158 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. నిన్న కరోనా నుంచి 9,754 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 59,442గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,23,88,475కు పెరిగింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 178.83…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, మరణాలు భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 5,921 కొవిడ్ కేసులు బయటపడగా.. 11,651 మంది కోలుకున్నారు. 289 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 63,878గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసులు 4,29,45,284గా వున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా మొత్తం మరణాలు 5 లక్షల14 వేల 878గా వున్నాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 63,878…
ఇండియాలో కరోనా ప్రభావం బాగా తగ్గింది. ఇవాళ ఇండియాలో భారీగా తగ్గాయి కరోనా పాజిటివ్ కేసులు. 7,554 కొత్త కేసులు నమోదయ్యాయి. 223 మరణాలు నమోదయ్యాయి. 14,123 రికవరీ అయినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బులిటిన్ తెలిపింది. యాక్టివ్ కేసులు 85,680గా వున్నాయి. సోమవారం కేసుల సంఖ్య భారీగా తగ్గగా.. మంగళవారం స్వల్పంగా పెరిగింది. నిన్నటికంటే 9శాతం కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో రోజువారి పాజిటివిటీ రేటు 0.90 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో యాక్టివ్…
భారత్లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు మరో 1,27,952 మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 1,059 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,059 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,30,814 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉన్నట్లు కేంద్ర…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే వుంది. అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక మరణాలు సంభవించినవి భారత్ లోనే. దేశంలో ఇప్పటివరకూ 5 లక్షలమంది కోవిడ్ 19 కారణంగా మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది జులై 1కి మనదేశంలో మరణాలు నాలుగు లక్షలు నమోదయ్యాయి. 217 రోజుల్లో మరో లక్ష మరణాలు సంభవించాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మరణాలు 5,00,055కి చేరాయి. గత 24 గంటల్లో 1,49,394 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.…
1.గడిచిన 24 గంటల్లో దేశంలో 3,33,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారంతో పోలిస్తే స్వల్పంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 525 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,92,37,264కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,89,409కి చేరుకుంది. 2 తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. తాజాగా 3603 కేసులు నమోదు కాగా రికవరీ అయినవారు 2707 మంది. ఒక…
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణుకు పుట్టిస్తోంది. ప్రపంచంలో 30 కోట్ల కేసులు నమోదైతే.. అందులో ఆరు కోట్ల కేసులు అమెరికాలోనే బయటపడ్డాయి. ఇక థర్డ్‌వేవ్‌లో ప్రతి రోజు లక్షల మందికి కరోనా సోకడం అమెరికాను కలవరపెడుతోంది. అమెరికాలో 14 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ తో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల సగటును పరీక్షిస్తే ప్రతి సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా చైనాలో…