India Corona: మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇవాళ దేశంలో అత్యల్ప రోజువారీ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో కొవిడ్ తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఇండియాలో కొత్తగా 89 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య కొవిడ్ ప్రారంభమైన మార్చి 27, 2020 నుంచి నేటి వరకు అత్యల్ప కొవిడ్ కేసుల సంఖ్య అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే క్రియాశీల కేసులు 2,035కి తగ్గాయి.
ఇప్పటివరకు మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4.46 కోట్లు (4,46,81,233) కాగా.. మరణాల సంఖ్య 5,30,726గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.05 శాతంగా నమోదు కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.09 శాతంగా నిర్ణయించబడింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.01గా నమోదైంది. రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,48,472కి పెరిగింది, అయితే మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.
Pakistan: పెరిగిన కిడ్నాప్‌లు, బలవంతపు పెళ్లిళ్లు.. చర్యలు చేపట్టాలని ఐరాస సూచన
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.17 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి. భారత్‌లో వ్యాక్సినేషన్‌ల సంఖ్య ఆగస్టు 7, 2020న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు దాటింది. గత ఏడాది జనవరి 25న దేశం నాలుగు కోట్ల మైలురాయిని దాటింది.