భారతదేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది. కరోనా కేసుల తాకిడి తగ్గడంతో జనం మాస్క్ లు ధరించడం కూడా తగ్గించారు. అయితే అప్రమత్తంగానే వుండాలని వైద్యశాఖాధికారులు సూచిస్తున్నారు. దేశంలో కొత్తగా 1,260 కరోనా కేసులు నమోదయ్యాయి. 1404 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 83 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 0.03శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 0.24శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఇకపోతే దేశంలో మొత్తం కేసులు-4,30,27,035గా నమోదయ్యాయి. దేశంలో కరోనా కారణంగా సంభవించిన మరణాలు 5లక్షల 21 వేల 264గా వున్నాయి. కరోనా కేసులు తగ్గడంతో యాక్టివ్ కేసులు 13,445కి పడిపోయాయి. రికవరీలు 4, 24,92,326గా వున్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 1,84,52,44,856 డోసులు పంపిణీ చేశారు. శుక్రవారం 18,38,552 మందికి టీకాలు అందించారు. శుక్రవారం 5,28,021 కరోనా పరీక్షలు చేశారు. చిన్నారులకు కూడా వ్యాక్సినేషన్లు ఇస్తున్నారు. కరోనా ఆంక్షల్ని అన్ని ప్రభుత్వాలు ఎత్తివేయడంతో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. మనకు కరోనాను అంటించిన చైనాలో మాత్రం కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.