India-China Flights: ఐదేళ్ల తర్వాత చైనాకు విమాన సర్వీసులు.. ఎయిర్ ఇండియా, ఇండిగోలకు కేంద్రం ఆదేశాలు
- భారత్–చైనా మెరుగుపడుతున్న సంబంధాలు..
- ఐదేళ్ల తర్వాత చైనాకు ప్రారంభంకానున్న విమాన సర్వీసులు..
- వచ్చే నెలలో సర్వీసులు స్టార్ట్ చేయాలని ఎయిర్ ఇండియా, ఇండిగోలకు కేంద్రం ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-China Flights: గత కొన్నేళ్లుగా భారత్–చైనా మధ్య సంబంధాలు ఉద్రిక్తతంగా కొనసాగుతున్నాయి. 2020 జూన్‌లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో రెండు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో ఇండియన్ ఆర్మీకి చెందిన పలువురు మరణించారు. దీంతో సైనిక ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. గల్వాన్ ఘటన తరువాత ఇరుదేశాలు నియంత్రణ రేఖ (LAC) వెంబడి భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించాయి. పలుమార్లు సైనిక, దౌత్య చర్చలు జరిగినప్పటికీ, కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈ ఉద్రిక్తతల ఫలితంగా ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో చైనా పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక, డ్రాగన్ కంట్రీ నుంచి వచ్చే దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. అలాగే మహమ్మారి సమయంలో భారత్ కి వచ్చే విమాన సర్వీసులు నిలిపివేసింది. కాగా, ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దిశగా చర్చలు కొనసాగించడంతో ప్రస్తుతం సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి.
Read Also: AP Govt: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు జారీ..
Also Read
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
అయితే, వచ్చే నెలలో భారత్- చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరం అయ్యే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ నిర్ణయంతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతాయని పేర్కొంది. ఇక, బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి విమానయాన సంస్థలకు తక్షణమే చైనాకు సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండమని భారత ప్రభుత్వం సూచించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో ఆర్థిక, వాణిజ్యపరంగా ఇండియా- చైనా దేశాలు అమెరికాను ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!