Putin: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ప్రపంచంలోనే అత్యధికంగా 50 శాతం సుంకాలను విధించారు. ఈ నేపథ్యంలో, భారత్, చైనాలు గత ఘర్షణలను మరించి స్నేహంగా మెలగాలని నిర్ణయించుకున్నాయి. దీనికి ఇటీవల చైనాలో జరిగిన ఎస్‌సీఓ సమ్మిట్ వేదికగా నిలిచింది. ఏడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ-జిన్‌పింగ్-పుతిన్ ఉల్లాసంగా మాట్లాడుకుంటున్న ఫోటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది.
Read Also: Shocking Crime: స్నేహితుడితో చూడకూడని స్థితిలో భార్య.. మరణశాసనం రాసిన భర్త..
అయితే, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. ఇండియా-చైనా సంబంధాలను ఉద్దేశిస్తూ ‘‘డ్రాగన్-ఏనుగు’’ డ్యాన్స్‌కు మీడియా రష్యా ‘‘ఎలుగుబంటి’’ని జోడించిందని ఆయన అన్నారు. తరుచుగా చైనాను డ్రాగన్‌తో, భారత్‌ని ఏనుగులో పోలుస్తారు. ఇటీవల, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్-చైనాలను ఉద్దేశిస్తూ..డ్రాగన్-ఎలిఫెండ్ డ్యాన్స్ ప్రపంచానికి మంచిదని అన్నారు. ఇక్కడ ‘‘ఎలుగుబంటి’’ రష్యాకు ప్రతీక. పుతిన్ ఈ వ్యాఖ్యల్ని 2025 ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరంలో చేర్చారు. ‘‘ ఎలుగుబంటి రష్యాకు ప్రతీక, కానీ ఇది తూర్పు సరిహద్దు ప్రాంతం కాబట్టి, ఇక్క ఉన్న అమూర్ పులి(సైబీరియన్ టైగర్) ను ఉపయోగిస్తే బాగుండేది’’ అని పుతిన్ చమత్కరించారు.
ఇదిలా ఉంటే, పరోక్షంగా ట్రంప్‌కు, అమెరికాకు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా జాతీయ చిహ్నమైన రెండు తలల గద్ద గురించి ప్రస్తావిస్తూ.. తూర్పు, పశ్చిమం వైపు చూస్తుంది, కానీ ‘‘దక్షిణం’’ కూడా ఉంటుందని మీకు తెలుసు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత్, చైనా వంటి దేశాలతో పాటు వర్తమాన దేశాలను ‘‘గ్లోబల్ సౌత్’’గా వ్యవహరిస్తారు. ఈ ఉద్దేశంతోనే పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.