China: చైనా-భారత్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ బోర్డర్‌లో మరింత మంది సైన్యాన్ని మోహరించింది. అయితే, ఈ పరిణామాలు డ్రాగన్ కంట్రీ చైనాకు మింగుడు పడటం లేదు. వివాదాస్పద సరిహద్దుల్లో భారత్ మరిన్ని బలగాలను మోహరించడం ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఉపయోగపడేది కాదని చైనా విశ్వసిస్తోదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి శుక్రవారం అన్నారు. చైనాతో వివాదాస్పద సరిహద్దులను మరింత బలోపేతం చేసేందుకు 10,000 మంది సైన్యాన్ని మోహరించింది.
తూర్పు లడఖ్‌లో మూడేళ్లుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారత్, చైనాలు ఆదివారం (నేడు) తూర్పు లడఖ్ సెక్టార్‌లోని చుషుల్-మోల్డో సమావేశ స్థలంలో 18వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలను నిర్వహిస్తున్నాయి. భారత్ వైపు నుంచి ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.
Air Force's Massive Exercise Near LAC In Northeast: ఇండియా-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ నిన్న చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులతో మాట్లాడారు. లడఖ్ వద్ద వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద సైనికులతో యుద్ధ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. దీంతో చైనా మరేదైనా కుట్ర చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి.