Army Commander RP Kalita: భారత్-చైనా సరిహద్దుపై ఆర్మీ కమాండర్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eastern Army Commander Rana Pratap Kalita Says LAC situation stable: భారత్, చైనా సరిహద్దు విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. సరిహద్దుల్లో భ్రదత పటిష్టంగా ఉందని తూర్పు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రానా ప్రతాప్ కలిటా అన్నారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో.. భారత్, చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1971లో పాకిస్థాన్‌పై విజయానికి గుర్తుగా ప్రతిఏటా డిసెంబర్ 16న నిర్వహించే విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళ్లు అర్పించిన ఆయన.. ఆ తర్వాత తవాంగ్ సంఘటనపై స్పందించారు.
Viral Video: “హస్బెండ్ ఆఫ్ ది ఇయర్” ఇతనిదే.. స్టేడియంలో భార్య మేకప్‌కి హెల్ప్
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
వాస్తవాధీన రేఖ విషయంలో భారత్, చైనా మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని.. భారత్‌లో అంతర్భాగమైన 8 ప్రాంతాలపై పట్టు సాధించేందుకు చైనా దళాలు ప్రయత్నిస్తున్నాయని ఆర్పీ కలిటా పేర్కొన్నారు. ఈ ప్రాంతాలు తమ భూభాగం పరిధిలోకి వస్తాయని చైనా వాదిస్తోందని అన్నారు. ఇక తవాంగ్‌లో ఇరు దేశాల దళాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఇరు పక్షాల వారికి గాయాలు అయ్యాయని చెప్పారు. చైనా సైనికులు సరిహద్దుని దాటి, భారత్‌వైపు దూసుకురావడంతో.. స్థానిక కమాండర్లు పరిస్థితుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారని, ఈ క్రమంలోనే చిన్నపాటి ఘర్షణ జరిగిందని అన్నారు. ఈ ఘర్షణకు ముందు గానీ, ఆ తర్వాత గానీ భారత్ భూభాగంలోకి చైనా చొరబడలేదని స్పష్టత ఇచ్చారు.
Macharla Clashes: రణరంగంగా మారిన మాచర్ల.. వైసీపీ, టీడీపీ వర్గీయుల దాడులు, ప్రతిదాడులు
భారత్‌కు రక్షణ కల్పించేందుకు భారత సైనికులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని కలిటా వెల్లడించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా భారత సైనికులు వెనకాడబోరని చెప్పారు. గత పది, పదిహేనేళ్ల నుంచి సరిహద్దులో రోడు, రైలు మార్గాల నిర్మాణ ప్రక్రియ వేగవంతం కావడంతో.. సరిహద్దులో రక్షణ మరింత బలోపేతం అవుతోందని, రక్షణ దళాలకు విధి నిర్వహణ సులభతరంగా మారిందని ఆర్పీ కలిటా తెలిపారు. కాబట్టి.. సరిహద్దు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని మరోసారి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!