జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ, ఇండియా కూటమి నేతలను హేమంత్ ఆహ్వానించారు. కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా కూటమికి చెందిన నేతలు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షాను కూడా ఆహ్వానించారు. గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్.. హేమంత్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. 2000 నవంబర్ 15న బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం పదవిని సోరెన్ చేపట్టడనుండటం ఇది నాలుగోసారి.
ఇది కూడా చదవండి: Siddharth : ‘మిస్ యు’ రిలీజ్ వాయిదా.. కారణం ఇదే..?
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాలకు గాను 56 స్థానాలను జేఎంఎం కూటమి గెలుచుకుంది. వరుసగా రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ 24 స్థానాలు కైవసం చేసుకుంది. బర్హయిత్ నియోజకవర్గం నుంచి హేమంత్ సోరెన్ 39,491 ఓట్ల ఆధిత్యంతో బీజేపీ అభ్యర్థి గామ్లియెల్ హెంబ్రోమ్‌పై గెలుపొందారు. 43 స్థానాల్లో పోటీ చేసిన జేఎంఎం పార్టీ చరిత్రలోనే అత్యధికంగా 34 సీట్లు గెలుచుకుంది. కూటమి భాగస్వాములైన కాంగ్రెస్-16, ఆర్జేడీ- 4, సీపీఐ (ఎంఎల్)- 2 సీట్లు గెలుచుకున్నాయి. కొత్త ప్రభుత్వంలో ఆర్జేడీకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Minister Ponnam Prabhakar: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ
ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ కేబినెట్‌లో కల్పనా సోరెన్‌కు అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనీలాండరింగ్ కేసులో హేమంత్ జైలు కెళ్లిన తర్వాత.. పార్టీని ముందుండి నడిపించి పార్టీని విజయతీరాలకు నడిపించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో గాండే నియోజకవర్గం నుంచి 17 వేల ఓట్లతో కల్పన విజయం సాధించారు. భర్త జైలుకెళ్లినప్పుడు ముఖ్యమంత్రి రేసులోకి వచ్చారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమె బరి నుంచి నిష్క్రమించారు.
ఇది కూడా చదవండి: Telangana: రేపటి నుంచి రైతు పండుగ.. రైతులకు అవగాహన కల్పించేలా వేడుకలు