Rinku Singh Six: రింకూ సింగ్ పవర్‌ఫుల్ షాట్.. బాక్సులు బద్దలు! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rinku Singh Six Brokes window glass in IND vs SA 1nd T20: ఐపీఎల్ స్టార్, టీమిండియా యువ ఆటగాడు రింకూ సింగ్ భారీ షాట్లతో అలరిస్తున్నాడు. ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టీ20ల సిరీస్‌లో చెలరేగిన రింకూ.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డపైనూ దుమ్మురేపుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో టీ20లో రింకూ 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. రింకూ కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.
దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్‌రమ్ వేసిన 19వ ఓవర్ చివరి బంతిని రింకూ సింగ్ భారీ సిక్సర్‌గా మలిచాడు. ముందుకొచ్చి స్ట్రైట్‌గా షాట్ ఆడగా.. బంతి సైట్ స్క్రీన్‌పై ఉన్న మీడియా బాక్స్ గ్లాస్‌ను తాకింది. బంతి బలంగా తాకడంతో గ్లాస్ పగిలిపోయింది. ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పుడు వైరల్ అవుతోంది. వాట్ ఏ ప్లేయర్, వాట్ ఏ షాట్ అంటూ రింకూ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రింకూ అంతకుముందు బంతిని కూడా భారీ సిక్సర్‌గా మలిచాడు.
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
Also Read: Suryakumar Yadav: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. రింకూ సింగ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ (56; 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. డక్‌వర్త్ లూయిస్ విధానంలో సవరించిన లక్ష్యాన్ని (15 ఓవర్లలో 152) దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హెండ్రిక్స్ (49; 27 బంతుల్లో 8×4, 1×6), మార్‌క్రమ్ (30; 17 బంతుల్లో 4×4, 1×6) చెలరేగారు.
Rinku Singh’s six broke media box glass. 🔥
– Rinku is insane…!!!!pic.twitter.com/hJazne80PU
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2023
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..