న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో వర్షం ప్రభావం కారణంగా ఇబ్బంది పడి డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో (70) హాఫ్ సెంచరీ చేసినా జట్టును మాత్రం ఆదుకోలేదు. రెండో టెస్టులో 1, 17 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. స్పిన్‌ను ఉతికారేసే కోహ్లీ.. సొంతగడ్డపై స్పిన్నర్లకే వికెట్లను ఇచ్చేయడం అందరిని నిరాశకు గురిచేస్తోంది. విరాట్ ఆట తీరుపై ఆస్టేలియా మాజీ…
భారత గడ్డపై టీమిండియాపై విజయంను తాము డబ్ల్యూటీసీ ఫైనల్లో సాధించిన గెలుపు కంటే ఎక్కువని భావిస్తున్నాం అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ తెలిపాడు. బెంగళూరు టెస్టులో టాస్‌తో అదృష్టం కలిసొచ్చిందని, ఒకవేళ భారత్ మొదట బౌలింగ్ తీసుకొని ఉంటే తమకు కష్టాలు ఉండేవే అని చెప్పాడు. రెండో టెస్టులో మాత్రం తాము అనుకున్నట్లుగానే ఆడి ఫలితం రాబట్టాం అని సౌథీ చెప్పుకొచ్చాడు. భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే.. న్యూజిలాండ్ 2-0…
ఇప్పటివరకు జరిగిన రెండు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లోనూ భారత్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరిన భారత్.. మూడోసారి కూడా ఆ దిశగా దూసుకెళ్లింది. అయితే భారత్‌కు న్యూజిలాండ్‌కు భారీ షాక్ ఇచ్చింది. సొంతగడ్డపై వరుసగా రెండు టెస్టుల్లోనూ కివీస్ చేతిలో ఓడడంతో టీమిండియా అవకాశాలపై ప్రభావం చూపింది. అంతేకాదు ఫైనల్ ఆశలు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు 73 గెలుపు శాతంతో భారత్ అగ్రస్థానంలో ఉంది.…
సొంతగడ్డపై ఎదురులేని భారత్.. న్యూజిలాండ్‌తో మూడు టెస్టు సిరీస్‌ను సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. టీమిండియాకు ప్రధాన అస్రం అయిన స్పిన్ ఉచ్చులోనే పడి భారత బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. కివీస్ రెండు టెస్టుల్లోనూ విజయం సాధించి.. భారత గడ్డపై మొదటిసారి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. నవంబర్ 1 నుంచి ముంబై వేదికగా జరిగే మూడో టెస్టులో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలోనే పిచ్ విషయంలో టీమిండియా కఠిన నిర్ణయం…
భారత్‌తో మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ మూడో టెస్ట్‌కు సైతం దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గజ్జల్లో గాయం కారణంగానే బెంగళూరు, పూణేలో జరిగిన మొదటి రెండు టెస్టులకు సైతం కేన్ మామ దూరమయిన విషయం తెలిసిందే. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో కేన్ విలియమ్సన్ గజ్జల్లో గాయం అయింది. పూర్తిస్థాయి ఫిట్నెస్…
న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో ఓడిన భారత్ ఇప్పటికే సిరీస్ కోల్పోయింది. నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో మూడో టెస్టు ఆరంభం కానుంది. చివరి టెస్టులో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా చూస్తోంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు తుది జట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశముంది. రెండో టెస్టులో మూడు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. టాప్-4ను భారత్ కొనసాగించనుంది. కఠినమైన ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో రోహిత్ శర్మ, యశస్వి…
సుదీర్ఘకాలం అనంతరం స్వదేశంలో భారత్ టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. న్యూజిలాండ్‌పై మొదటి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా.. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను కివీస్‌కు అప్పగించింది. సొంతగడ్డపై చెత్త ప్రదర్శన చేసిన రోహిత్ సేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పిన్ ఆడటంలో విఫలమైన బ్యాటర్ల ఆట తీరును ఎత్తిచూపుతున్నారు. కొందరు రోహిత్ శర్మ కెప్టెన్సీ పైనా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ హిట్‌మ్యాన్‌కు మద్దతు పలికాడు. న్యూజిలాండ్‌పై సిరీస్ ఓటమికి రోహిత్…
భారత గడ్డపై న్యూజిలాండ్ మొదటిసారి టెస్ట్ సిరీస్ గెలిచింది. సొంతగడ్డపై ఎదురులేకుండా పోతున్న టీమిండియాకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు చేతులేయడంతోనే బెంగళూరు, పూణే టెస్టుల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ముంబైలో మూడో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అనంతరం రోహిత్ సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో మూడో టెస్టులో మార్పులు చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టులో కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌కు…
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ ఓటమికి సీనియర్ ఆటగాళ్లదే బాధ్యత అని టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. జట్టుపై కోచ్ ప్రభావం చాలా తక్కువ అని నా అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ మైదానంలో అడుగు పెట్టడని, కెప్టెనే అన్నీ చూసుకుంటాడన్నాడు. ఓటములు ఎదురైనపుడు విమర్శలు వస్తే.. వాటినీ తీసుకోవాలని డీకే పేర్కొన్నాడు. రోహిత్ సేన మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్‌కు కోల్పోయిన విషయం తెలిసిందే. ‘న్యూజిలాండ్ సిరీస్ ఓటమి బాధ్యతను సీనియర్లకు…