కోల్‌కతాలో జరిగిన సామూహిక అత్యాచారం-హత్య ఘటన అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌తో పాటు యావత్ దేశమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దేశ వ్యాప్తంగా ఇలాంటి అనేక సంఘటనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇలాంటి ఘటనలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక మెస్సెజ్ ఇచ్చాడు. ఆయన ఇన్‌స్టాలో ఓ స్టోరీని పంచుకున్నాడు. 'కూతుర్ని కాపాడుకోవడం కంటే.. కొడుకు, తమ్ముడు, భర్త, తండ్రి, స్నేహితులకు చదువు చెప్పించడం మేలు'…
సిద్దిపేట ప్లెక్సీ వార్ ఘటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫ్లెక్సీ చింపివేశారని బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుతో కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది. సిద్దిపేట రూరల్, వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.. పోలీసులు. ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి కాన్వాయ్ తో బయలుదేరారు.…
ఆరోగ్యం క్షీణించి బస్సులోనే ప్రయాణికుడు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్లో చోటు చేసుకుంది. హల్ద్వానీ నుంచి కౌసాని వెళ్తున్న కేము బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి ఆరోగ్యం శుక్రవారం క్షీణించింది. దీంతో బస్సు డ్రైవర్ ఆ ప్రయాణికుడిని భవాలీ సీహెచ్‌సీకి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న యువకుడి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. బిల్ బోర్డు శిథిలాలు తొలగిస్తుండగా కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ మేనేజర్ మనోజ్ చన్సోరియా, ఆయన భార్య అనితగా గుర్తించారు.
హైదరాబాద్ మేడిపల్లి పరిధి బోడుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాల్ అనే బీటెక్ స్టూడెంట్ దుర్మరణం చెందాడు. విద్యార్థి బైక్ పై వెళ్తుండగా.. అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో విద్యార్థి విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి కారు ఢీకొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
ఈ ఏడాది టాలీవుడ్ లో శృతి హాసన్ చిరూ సరసన వాల్తేరు వీరయ్య సినిమాలోనూ అలాగే బాలయ్య తో వీర సింహా రెడ్డి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలని అందుకుంది.ఇదిలా ఉంటే ఈ భామ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే నేచరల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న హాయ్ నాన్న మూవీలో కూడా శ్రుతి హాసన్ ముఖ్య పాత్ర లో కనిపించనున్నారు.ఇలా…
హైదరాబాద్‌లోని దోమలగూడలో గ్యాస్ సిలీండర్ పేలుడు ఘటనలో మరొకరు మరణించారు. దీంతో ఈ ప్రమాద సంఘటనలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ నెల 10వ తేదీన గ్యాస్ సిలీండర్ లీక్ కావడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై వ్యక్తి మూత్ర విసర్జన ఘటనతో బీజేపీకి షాక్ తగిలింది. ఘటనకు కలత చెంది సిద్ధి జిల్లా ప్రధాన కార్యదర్శి బీజేపీకి రాజీనామా చేశారు