హైదరాబాద్‌లోని దోమలగూడలో గ్యాస్ సిలీండర్ పేలుడు ఘటనలో మరొకరు మరణించారు. దీంతో ఈ ప్రమాద సంఘటనలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ నెల 10వ తేదీన గ్యాస్ సిలీండర్ లీక్ కావడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. శరణ్య అనే చిన్నారి ఆదే రోజు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈనెల 14న పద్మ, ఆమె కూతురు ధనలక్ష్మి, ధనలక్ష్మి కొడుకు అభినవ్ లు మరణించారు.
Read Also: Tragedy: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. ఆ తల్లి కళ్లారా చూసుకునేలోపే..
ఇవాళ (ఆదివారం) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగమణి మృతి చెందింది. దీంతో గ్యాస్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. ఇదే ఘటనలో తీవ్ర గాయాలతో ఆనంద్, విహాన్ లు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బోనాల పండుగ నేపథ్యంలో ఈనెల 10న దోమలగూడలోని ఓ ఇంట్లో పిండి వంటలు రెడీ చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలు కాగా.. చికిత్స పొందుతూ ఇప్పటికే వరకు ఐదుగురు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
Read Also: SP Leader Azam Khan: ఎస్‌పీ నేత ఆజంఖాన్‌కు రెండేళ్ల జైలు .. విద్వేషపూరిత ప్రసంగాల కేసులో శిక్ష ఖరారు