పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి ఆర్మీ చీఫ్, షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. పాకిస్థాన్‌ను బానిసలుగా మార్చే వారితో తాను ఎలాంటి రాజీపడబోనని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 9 ఏళ్లు జైల్లో ఉండేందుకు సిద్ధమన్నారు.
పాకిస్థాన్ టెహ్రీక్ ఈ ఇన్సాఫ్ వ్యవస్థాప అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలు అధికారులు, సిబ్బందిపై సంచలన ఆరోపణలను చేశారు. తన భార్య బుష్రా బీబీకి జైలులో టాయ్ లెట్ క్లీనర్ కలిపిన విషా ఆహారాన్ని ఇచ్చేవారిని పేర్కొన్నారు.
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్‌లో జైలు నుండి విడుదల అవుతారని ఆ పార్టీ కీలక నేత సర్దార్ లతీఫ్ ఖోసా వెల్లడించారు. తోషాఖానా కేసులో మాజీ ప్రధానికి విధించిన శిక్షను కోర్టు సస్పెండ్ చేసింది, అయితే సైఫర్ కేసు ఒక వారం కూడా నిలబడదని ఖోసా ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సోమవారం బిగ్ రిలీఫ్ లభించింది. ప్రభుత్వ ఖజానా (తోషాఖానా) అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ఇద్దరికీ 14 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే..
Joe Biden: పాకిస్తాన్‌తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నట్లుగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ చెప్పారు. ఈ మేరకు పాకిస్తాన్‌కి కొత్తగా ఎన్నికైన ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కి లేఖ రాశారు.
Imran Khan: ఫిబ్రవరిలో దాయాది దేశం పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఓటమి కోసం చాలా చోట్ల రిగ్గింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా వీటిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లు ఉంటే రిగ్గింగ్ సమస్యల్నీ గంటలో పరిష్కారమయ్యేవని ఆయన అన్నారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ అడియాలా జైలులో మీడియాతో…
Pakistan : సుదీర్ఘ రాజకీయ సంక్షోభం తర్వాత ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ 24వ ప్రధాని అయ్యారు. పీటీఐ, సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ ప్రతిపక్ష అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్‌ను ఓడించి షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లను నిషేధించాలని ఆ దేశంలోని చట్టసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సోషల్ మీడియ సైట్లపై బ్యాన్ విధించాలని సెనెట్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన సెనెటర్ బహ్రమంద్ టాంగీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఫేస్బుక్, టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి వాటిని నిషేధించాలని తీర్మానంలో కోరారు. మార్చి 11తో సెనేటర్‌గా పదవీకాలం ముగియబోతున్న తరుణంలో టాంగీ ఈ తీర్మానాన్ని తీసుకురావడం గమనార్హం.
Pakistan: పాకిస్తాన్ కొత్త ప్రధానిని ఎన్నుకోవడానికి సిద్ధమైంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) సహకారంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్‌ని ఆదివారం ప్రధానిగా ఎన్నుకోనున్నారు. మరోవైపు జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఒమర్ అయూబ్ ఖాన్ని తన ప్రధానమంత్రి అభ్యర్థిగా నామినేట్ చేసింది. అయితే, ఇతను గెలిచే పరిస్థితి లేదు.
పీటీఐ వ్యవస్థాపకుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన లాయర్లను జైలులోనే ఒంటరిగా కలిసేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. జైలు హ్యాండ్‌బుక్ ప్రకారం.. ఇమ్రాన్‌ఖాన్‌ను ఒంటరిగా కలిసేందుకు న్యాయవాదులను అనుమతించాలని జైలు నిర్వాహకులను కోర్టు ఆదేశించింది.