పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక పోస్టు చేశారు. తనకు దేశం విడిచి వెళ్లే అవకాశం వచ్చినా తాను అంగీకరించలేదని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్లో తెలిపారు.
పాకిస్తాన్ లో శాంతి భద్రతలు అదుపు తప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్న అమెరికా పౌరులకు ఆ దేశ అడ్వైజరీ హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 16వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
ఆర్టీసీ కార్గో పార్సిల్లో లక్ష రూపాయల చీర… బస్సు డ్రైవరు ఫోన్ స్విచ్ ఆఫ్ ఖరీదైన చీర మాయం కావడంతో ఆర్టీసీ అధికారుల మెడకు చుట్టుకుంది. చీర ఎక్కడుందో తెలియక కార్గో ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ కార్గో సర్వీసులను నిర్వహిస్తోంది. పార్శిళ్లను సకాలంలో పంపిణీ చేస్తుండటంతో చాలామంది ఆర్టీసీ కార్గో సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వినుకొండ డిపోకి రావాల్సిన పార్శిల్ రాకపోవడంతో కార్గో ఉద్యోగులు హైరానా పడుతున్నారు. ఎందుకంత…
మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దతుగా పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నేతలు, కార్యకర్తలు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అణచి వేసేందుకు.. కనిపిస్తే కాల్చివేతకు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ రణరంగాన్ని తలపిస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రాజధాని ఇస్లామాబాద్ మార్చ్‌కి పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో నిరసనకారులు ఇస్లామాబాద్‌కి చేరుకోవడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో నలుగురు పోలీసులు, ఒక పౌరుడు మరణించాడు. ఇదిలా ఉంటే, పరిస్థితిని చక్కదిద్దేందుకు జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం పాక్ ఆర్మీని కోరింది.
Pakistan: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరంలో మరోసారి లాక్డౌన్ విధించారు. ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమావేశాల సమయంలో, ప్రధాన దేశాల నేతలు రావడంతో ఇస్లామాబాద్-రావల్పిండిలో లాక్డౌన్ విధించింది. తాజాగా మరోసారి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోసం అతని మద్దతుదారులు తీవ్ర నిరసనలకు సిద్ధమయ్యారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఆయన సన్నిహితులకు ఇస్లామాబాద్ కోర్టులో ఉపశమనం లభించింది. సెక్షన్ 144 ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో బుధవారం మాజీ ప్రధాని, అతని సన్నిహితులను నిర్దోషులుగా ప్రకటించింది.
Pakistan : ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల నుంచి పాకిస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. దేశంలో ఎక్కడ చూసినా నిరసనలు, రాజకీయ సంక్షోభం ముదురుతున్నాయి.
Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌తో మెరుగైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌తో సంబంధాలను చెడగొట్టడంలో ఇమ్రాన్ కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు.
ఆక్స్ఫర్డ్ ఛాన్సలర్ రేసు నుంచి ఇమ్రాన్‌ఖాన్ తప్పుకున్నారు. యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి పోటీ చేస్తున్న జాబితాలో ఇమ్రాన్‌ఖాన్ పేరు లేదని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇమ్రాన్‌ఖాన్‌పై నేరారోపణలు ఉండడంతో ఆయనను పోటీ నుంచి యూనివర్సిటీ తప్పించింది.