ఇమ్రాన్ ఖాన్‌తో సైన్యం పరోక్షంగా చర్చలు జరిపినట్లు నాకు సమాచారం ఉంది.. ఇమ్రాన్ ఖాన్ కు సైన్యం పంపిన సందేశంలో.. మే 9 నాటి హింసకు కుట్ర పన్నినట్లు అంగీకరించాలని పేర్కొంది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) తరఫున ప్రధాని అభ్యర్థిగా తన సోదరుడు షహబాజ్ షరీఫ్‌ను ఆయన నామినేట్ చేశారు.
జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన 30కి పైగా పిటిషన్లను పాకిస్థాన్ కోర్టు మంగళవారం తిరస్కరించింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం నవాజ్‌తో సహా పీఎంఎల్-ఎన్ అగ్రనేతల విజయంపై పిటిషన్ సవాల్ చేసింది.
పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటం దాదాపు ఖాయమైంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ - పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రతిపక్షంలో కూర్చోనుంది. పాలక కూటమిలో నవాజ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ (ఎంక్యూఎం) ఉన్నాయి.
PML-N alliance talks with PPP in Pakistan Elections 2024: పాకిస్థాన్ ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో.. అక్కడ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ, మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అండతో పీఎంఎల్-ఎన్…
Pakistan Elections: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, వేర్పాటువాద ఉద్యమాలతో సతమతం అవుతున్న పాకిస్తాన్లో ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 266 జాతీయ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు పూర్తైంది. అయితే, ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీని సొంతం చేసుకోలేదు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇన్సాఫ్ (PTI)కి చెందిన నేతలు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. మరోవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ అయిన ‘‘పాకిస్తాన్…
Pakistan Elections: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఎన్నికలు జరిగి మూడు రోజులు గడుస్తున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. పాక్ ప్రజలు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టలేదు. దీంతో ఆ దేశంలో విజేత ఎవరనేది స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ దేశవ్యాప్తంగా ఆందోళనకి పిలుపునిచ్చారు. రిగ్గింగ్…
Pakistan election: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, అస్థిరత నేపథ్యంలో పాకిస్తాన్ ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ కట్టబెట్టలేదు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మద్దతు ఉన్న అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు. అయితే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో అక్కడి ఎన్నికల కమీషన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ బ్యాట్ గుర్తును రద్దు చేయడంతో, అతని మద్దతుదారులు ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు.…
పాకిస్థాన్ (Pakistan) సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ పార్టీలు ఎవరికి వారే విజయం సాధించామంటూ చెప్పుకుంటున్నారు.
పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఏఐ ఆధారిత విక్టరీ స్పీచ్ ను రిలీజ్ చేశారు. ఈ ప్రసంగంలో ఆయన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధినేత నవాజ్ షరీఫ్ లండన్ ప్లాన్ ఫెయిల్ అయిందన్నారు.