India Economy: ఆర్థికమాంద్యం భయాలు, రష్యా ఉక్రెయిన్ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్లు యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయని అనుకుంటున్నప్పటికీ, గాలి బుడగలా మారాయి. ఎప్పుడు బ్లాస్ట్ అవుతాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే శ్రీలంక దివాళా తీసింది.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతోంది. ఆ దేశానికి మిత్రదేశాలతో పాటు ఐఎంఎఫ్ వద్ద అప్పు పుట్టడం లేదు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక వేళ ఎంత ధర పెట్టి కొందాం అని అనుకున్న మార్కెట్లలో సరుకులు లభించడం లేదు. గోధుమ పిండి కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. గోధుమ కోసం అక్కడి ప్రజలు ఓ యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం అందించే గోధుమ పిండి కేంద్రాల…
IMF: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3 శాతం కన్నా తక్కువ వృద్ధిని సాధిస్తుందని, 2023లో ప్రపంచవృద్ధిలో భారత్, చైనాల వాటానే సగం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ గురువారం తెలిపారు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైెరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రం ప్రభావం చూపించాయని, దీంతో పాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని ఆమె హెచ్చరించారు.
ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నిధులను పొందడానికి కష్టపడుతుండగా, US డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి రికార్డు స్థాయిలో రూ.287.29కి పడిపోయింది. విదేశీ రిజర్వ్ ఎక్స్ఛేంజ్ కూడా USD 4.24 బిలియన్ల (మార్చి 24, 2023 నాటికి) కీలక స్థాయిలో చేరింది.
Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో దాయాది దేశం పాకిస్తాన్ అల్లాడుతోంది. కనీసం అక్కడి ప్రభుత్వం ప్రజలకు తినేందుకు తిండిని కూడా ఇవ్వలేకపోతోంది. ఎక్కడ చూసిన ఆహారం కోసం తొక్కిసలాటలు, కొట్లాటలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ లోని బలూచిస్తాన్, పంజాబ్, సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ఇలా అన్ని ప్రాంతాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇతర దేశాల నుంచి వచ్చే తిండి గింజలు ప్రజలకు చేరకముందే రాత్రికి రాత్రి మాయం అవుతున్నాయి.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు లేక ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకునేందుకు తంటాలు పడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన మందుల కొరతతో అల్లాడుతోంది. పాకిస్తాన్‌లోని డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ యొక్క వివాదాస్పద ధరల విధానం మరియు క్షీణిస్తున్న స్థానిక కరెన్సీ కారణంగా ఇతర దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునేందుకు ఇబ్బందులను…
Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పాకిస్తాన్. ఐఎంఎఫ్ 1.1 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని ఇస్తే తప్పా పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే అక్కడ ఆహార సంక్షోభం నెలకొంది. నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఒక వేళ ధరలు పెరిగినా కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్న తగినంత సరకులు అందుబాటులో ఉండటం లేదు. గోధుమ పిండితో పాటు వంటనూనె, చక్కెర ఇలా పలు నిత్యావసరాల కొరత వేధిస్తోంది.
Pakistan unable to feed soldiers: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. పెరిగిన ధరలు, ఆహారం కొరత పాక్ ప్రజలను వేధిస్తున్నాయి. చికెన్, వంటనూనె, పప్పులు, గోధుము ఇలా అన్ని నిత్యావసరాల ధరలు చుక్కలను చూస్తున్నాయి.