జీ20 సదస్సు విదేశీ ప్రతినిధులతో వైజాగ్ సందడిగా మారింది. విశాఖపట్నంలో G20 సదస్సు వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం ముగిసింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై జరిగిన ఈ సెషన్లో 14 సభ్య దేశాలు, 8 అతిథి దేశాలు, 10 అంతర్జాతీయ సంస్థల నుండి 57 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 2023 మౌలిక సదుపాయాల మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యం పైన ఈ చర్చలు జరిగాయి. ఫైనాన్సింగ్ మోడల్స్ వంటి ఇతర ముఖ్యమైన అంశాలను కూడా చర్చించారు.
భవిష్యత్ నగరాలను సృష్టించడానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల, నాణ్యతా మౌలిక సదుపాయాల పెట్టుబడి , ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం.. వంటి అంశాలపై చర్చించారు.. మౌలిక సదుపాయాల వర్గీకరణల అంతర్జాతీయ సంస్థల UNDP, OECD, IMF, ADB , మెక్సికోలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ జియోగ్రఫీ (INEGI) , యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ నుండి కీలకమైన అంతర్జాతీయ సంస్థల నిపుణులు 13 మంది పాల్గొని చర్చించారు.
Read Also:Bus Accident: అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా.. 64మందికి గాయాలు
మరోవైపు సీఎం జగన్ గన్నవరం నుంచి విమానంలో విశాఖ చేరుకున్నారు. సీఎం జగన్ కి స్వాగతం పలికారు మంత్రులు విడదల రజినీ, ఆర్ కె రోజా, పోలీస్ అధికారులు. అనంతరం G 20 సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు సీఎం….జీ20 సదస్సు నేపథ్యంలో విదేశీ ప్రతినిధులకు విందు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. ఇందులో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. G20 ప్రతినిధులతో సీఎం ముఖాముఖి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. జీ20 సదస్సు జరుగుతుండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
Read Also: Indrakaran Reddy: మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఇంద్రకిరణ్ సవాల్.. ఏ శిక్షకైనా సిద్ధం