Obulapuram Mining: ఓబులాపురం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఆక్రమణలు, అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 6 సభ్యులుగా ఏర్పాటు చేయబడింది. కమిటీని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుధాన్షు ధులియా చైర్ పర్సన్ గా నిర్వహిస్తారు. కమిటీ కన్వీనర్ అండ్ సెక్రటరీగా సర్వే, సెటిల్‌మెంట్స్ & ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ నియమించబడ్డారు. Ancient Temple Turkey: ముస్లిం…
Illegal Mining of Colored Stones: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్‌లో రంగురాళ్ల తవ్వకాలను జోరుగా సాగుతున్నాయి. వర్షాలు కురుస్తుండటం తవ్వకాలకు అనుకూలంగా మారింది. రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం పరిధిలోని 10 క్వారీల్లో తవ్వకాలు చేపట్టారు. అటవీ భూముల్లోనే కాకుండా రైతుల పట్టా భూముల్లోనూ రంగురాళ్లు దొరుకుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. గతంలో ప్రమాదాలు జరిగి అనేక మంది గిరిజనులు మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో విలువైన నీలి…
Kakani Govardhan Reddy: నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంపై రైతులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చంద్రబాబుకు మా నిరసనతో అర్థమైంది అన్నారు. ముఖ్యంగా, ఇటీవల జరిగిన రైతు ఉద్యమాన్ని ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టి వారి పోరును నీరుగార్చాలని చూస్తున్నట్లు తెలిపారు. ప్రతి చోట నోటీసులు జారీ చేయడం, హౌస్ అరెస్టులు విధించడం, కేవలం 15 మందితోనే ర్యాలీ నిర్వహించాలన్న నియమాలను కఠినంగా…
Kishan Reddy:దేశవ్యాప్తంగా మైనింగ్ రంగాన్ని మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఢిల్లీలో మాట్లాడారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) పై జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనింగ్ ద్వారా వచ్చే ప్రతి పైసాకు అకౌంటబిలిటీ ఉండేలా చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. Read Also:OnePlus Nord CE5: 7100mAh భారీ బ్యాటరీ, 50MP కెమరాతో…
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. కోర్టులో హాజరుపరచే ముందు.. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించారు. ఆస్పత్రిలోకి వెళ్లే ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు.. ఈ కాంగ్రెస్ సర్కార్ 20% కమీషన్ సర్కార్.. పోలీస్ ఆఫీసర్ల దగ్గర కమీషన్స్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే నాగరాజు.. అక్రమ మైనింగ్ చేస్తున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోకపోవడం హాస్యస్పదం.." అని వ్యాఖ్యానించారు. అంతలోపే…
Gali Janardhana Reddy: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన అక్రమ ఓబుళాపురం రవాణా మైనింగ్ కేసులో గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డికి శిక్ష పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు, రూ.10,000 జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుతో పాటు తాజాగా కర్ణాటక అసెంబ్లీ నుండి ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. Read Also: Operation Sindoor: మేడిన్ చైనా…
ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నట్లు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటువంటి తీర్పులు వెలువడినప్పుడు మైనింగ్ లో అక్రమాలు చెయ్యాలనుకునే వారికి దడ పుడుతుందన్నారు.. ఇలాంటి కేసులకు ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పుని వెలువర్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఎంత ఆలస్యం అయితే అంత నీరుగారే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేశారు..
Obulapuram Mining Case : అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (ఓఎంసీ) కేసులో కీలక మలుపు వచ్చింది. హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ కేసులో తుది తీర్పు వెలువరించనుంది. ఈ కేసు దాదాపు 15 ఏళ్లుగా నడుస్తూ వస్తోంది. 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించింది. 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలైంది. అనంతరం మిగతా నిందితులపై అనుబంధ అభియోగ పత్రాలు దాఖలయ్యాయి. మొత్తం…
Anil Kumar Yadav: అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయంలో ఎన్నో గనులపై జరిమానాలు విధించారని తెలిపారు. ఇక, శోభారాణి మైన్ కు రూ. 32 కోట్ల మేర ఫైన్ విధించారు.. మైన్స్ శాఖ అధికారి నాయక్.. విచారణ చేసి ఆ గనిలో 35 వేల టన్నుల తెల్లరాయి ఉందని నివేదికలో తెలిపారు.
ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గనుల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేపట్టారు.