Gali Janardhana Reddy: ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన గాలి జనార్ధన్ రెడ్డి.. రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుందా?
- ఓబుళాపురం రవాణా మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి శిక్ష
- కర్ణాటక అసెంబ్లీ నుండి ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gali Janardhana Reddy: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన అక్రమ ఓబుళాపురం రవాణా మైనింగ్ కేసులో గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డికి శిక్ష పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు, రూ.10,000 జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుతో పాటు తాజాగా కర్ణాటక అసెంబ్లీ నుండి ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
Read Also: Operation Sindoor: మేడిన్ చైనా ఏదైనా అంతేనా..? పాక్‌ను నిండా ముంచిన డ్రాగన్..!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
మే 6, 2025న శిక్ష ఖరారైన నేపథ్యంలో భారత రాజ్యాంగం 191(1)(e), ప్రజా ప్రతినిధుల చట్టం 1951 ప్రకారం ఆయన అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించబడ్డారు. కర్ణాటక అసెంబ్లీ విడుదల చేసిన ప్రకటనలో, ఆయన గంగావతి నియోజకవర్గానికి ఇకపై ఎమ్మెల్యేగా కొనసాగలేడని పేర్కొన్నారు. అలాగే, న్యాయస్థానం తీర్పు మేరకు జనార్ధన్ రెడ్డి శిక్ష అనంతరం ఇంకా ఆరు సంవత్సరాలపాటు ప్రజా పదవులు పొందడానికి అనర్హుడిగా ఉంటారు. అయితే, న్యాయస్థానం ఆయనకు శిక్షపై స్టే ఇస్తే మాత్రం ఈ అనర్హత తాత్కాలికంగా నిలిపివేయబడే అవకాశముంది.
Read Also: Chiranjeevi : సందీప్ రెడ్డి వంగాకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన చిరంజీవి..
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ ఖనిజ తవ్వకాల కేసులో జనార్ధన్ రెడ్డికి తోడు మరికొందరికి కూడా శిక్షలు విధించబడ్డాయి. ఇక ఆయన సంస్థపై కూడా రూ.1 లక్ష జరిమానా విధించారు. కేసులో గాలి జనార్ధన్ రెడ్డి రెండవ నిందితుడిగా ఉన్నారు. నిజానికి జనార్ధన్ రెడ్డి, బళ్లారిలో బీజేపీకి బలమైన నేతగా ఒకప్పుడు గుర్తింపు పొందారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి వీడ్కోలు చెప్పి “కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ (KRPP)” ఏర్పాటు చేసి గంగావతి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2024లో మాత్రం KRPPను బీజేపీలో విలీనం చేసి పార్టీలో తిరిగి చేరారు. ప్రస్తుత పరిణామాలతో గంగావతి నియోజకవర్గం స్థానము ఖాళీ అయ్యింది. త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!