విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత భూమా అఖిలప్రియ… ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.. ఆళ్లగడ్డ మండలం ఆర్ క్రిష్ణాపురంలో వైసీపీ నేతలు ఎర్రమట్టి దందా సాగిస్తున్నారన్న ఆమె.. పుల్లయ్య అనే వ్యక్తి పేరు మీద ఎకరాకు పర్మిషన్ తీసుకొని… మరికొన్ని ఎకరాల్లో ఎర్రమట్టి తవ్వుతున్నారని.. ఆళ్లగడ్డ…
మైనింగ్ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సహజ వనరుల దోపిడీపై ఫిర్యాదు రావడంతో… విశాఖలో క్వారీలపై తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రోన్లు, జీపీఎస్ ఆధారిత సర్వే ద్వారా అక్రమాల గుర్తించి.. ఇష్టారాజ్యంగా జరుగుతున్న గనుల తవ్వకాలకు చెక్ పెట్టనున్నారు. అనకాపల్లిలోని ఓ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై విచారణ జరపనుంది సీఐడీ. గనులశాఖ విజిలెన్స్ కూడా ఇప్పటికే భారీగా జరిమానాలు విధించింది. విశాఖలోని వందల క్వారీలు.. కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని నిర్ధారించారు.…
మైనింగ్ పై సమీక్ష నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై జిల్లాల వారీగా అవుట్‌సోర్సింగ్ ద్వారా సీనరేజీ కలెక్షన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.. ఈ విధానం వల్ల అదనంగా 35 నుంచి 40 శాతం సీనరేజీ ప్రభుత్వానికి జమ అవుతుందని అంచనా ఉందన్నారు.. వాల్యూమెట్రిక్ కు బదులు వెయిట్ బేసిస్ లో సీనరేజీ వసూళ్ళకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.. అక్రమ మైనింగ్, రవాణాను నియంత్రించగలిగితే 15 నుంచి 20 శాతం రెవెన్యూ పెరుగుతుందని…