Kishan Reddy:దేశవ్యాప్తంగా మైనింగ్ రంగాన్ని మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఢిల్లీలో మాట్లాడారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) పై జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనింగ్ ద్వారా వచ్చే ప్రతి పైసాకు అకౌంటబిలిటీ ఉండేలా చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
Read Also:OnePlus Nord CE5: 7100mAh భారీ బ్యాటరీ, 50MP కెమరాతో వన్ ప్లస్ నార్డ్ CE5 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
గతంలో అక్రమ మైనింగ్ అనేది పెద్ద స్థాయిలో జరిగేదని గుర్తు చేసిన కిషన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా మైనింగ్ పూర్తి స్థాయిలో మైనింగ్ పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కేంద్రం డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) ను ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఈ సంస్థ ద్వారా వచ్చే నిధులను మైనింగ్ వల్ల ప్రభావితమవుతున్న ప్రాంతాల్లో అభివృద్ధి కోసం వినియోగిస్తున్నామని చెప్పారు.
Read Also:YS Jagan: కూటమి సర్కార్‌పై జగన్ ఫైర్.. 3 హత్యలు, 6 హత్యాయత్నాలు, 12 దాడులుగా..!
DMF కు జిల్లా కలెక్టర్లు చైర్మన్ లుగా వ్యవహరిస్తారు. కాగా, మూడు రోజుల క్రితం వరకు తెలంగాణలో మాత్రం మంత్రులే DMF చైర్మన్‌లుగా ఉన్నారని, తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి కలెక్టర్లను చైర్మన్‌లుగా నియమించిందని పేర్కొన్నారు. DMF లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా భాగస్వాములుగా ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేశామని, మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి కలెక్టర్లే కీలక పాత్ర పోషిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ స్థాపించి ఇప్పటికి పదేళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌లో దేశవ్యాప్తంగా గనులు ఉన్న జిల్లాల కలెక్టర్లు, ఆయా రాష్ట్రాల గనుల శాఖ అధికారులు పాల్గొని అభిప్రాయాలు పంచుకున్నారు.