హర్యానాలోని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్ ఇంట్లో సోదాలు చేస్తుండగా అక్రమ విదేశీ ఆయుధాలు, 300కు పైగా కార్ట్రిజ్‌లు, 100కు పైగా విదేశీ మద్యం బాటిళ్లు, 5 కోట్ల రూపాయల డబ్బు, సుమారు 5 కేజీల బంగారు, వెండి ఆభరణాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ED Raids: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ సన్నిహితుడి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. అక్రమ మైనింగ్ ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ రోజు రాంచీ, రాజస్థాన్‌లోని 10 ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నాయి. జార్ఖండ్ సీఎం ప్రెస్ అడ్వైజర్ అభిషేక్ ప్రసాద్‌తో పాటు హజారీబాగ్ డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర దుబే, సాహిబ్ గంజ్ జిల్లా కలెక్టర్ రామ్ నివాస్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. రామ్ నివాస్ ఇల్లు రాజస్థాన్‌లో ఉంది.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ ను అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి మైన్ ఎదుట నిరసన చేస్తున్నారు.