మ్యూజిక్ దిగ్గజాలు ఏఆర్ రెహమాన్, ఇసైజ్ఞాని ఇళయరాజా తాజాగా దుబాయ్‌లో ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ జంట చాలా మంది సంగీతకారులకు హాట్ ఫేవరెట్ అన్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే… దుబాయ్ లో ఉన్న మాస్ట్రో రెహమాన్ స్టూడియో ఫిర్దౌస్ ని ఆదివారం ఇళయరాజా సందర్శించారు. ఎఆర్ రెహమాన్ ట్విట్టర్‌లో మ్యూజిక్ లెజెండ్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. “మా ఫిర్దౌస్ స్టూడియోకి మాస్ట్రో ఇళయరాజాను స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది… భవిష్యత్తులో మా ఫిర్దౌస్…
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా ఆరోగ్యం బాగోలేదని. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటున్నారని గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలు నిజమో, కాదో తెలియకుండానే నెటిజన్లు ఇళయరాజా కోలుకోవాలని కామెంట్స్ పెట్టేస్తున్నారు. ఇక తాజాగా ఈ పుకార్లకు చెక్ పెట్టారు ఇళయరాజా.. ఎంతో చక్కగా తనదైన శైలిలో ఒక మధురమైన పాటను ఆలపిస్తూ అందరికి నూతన సంవత్సర శుబాకాంక్షలు తెలుపుతూ వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం…
ఇటీవల కాలంలో ఇండియన్ స్ర్కీన్ పై బయోపిక్ ట్రెండ్ బాగా నడుస్తోంది. బడా బడా స్టార్స్ కూడా బయోగ్రాఫికల్ డ్రామాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ధనుష్ కన్ను కూడా ఈ బయోపిక్స్ పై పడింది. రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ధనుష్ ఇప్పటి వరకు ఎవరి బయోపిక్‌లో నటించ లేదు. అవకాశం లభిస్తే తను కూడా బయోపిక్‌లలో నటిస్తానంటున్నాడు ధనుష్. ఇటీవల తన సినిమా ‘అత్రంగి రే’ ప్రచారంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈ నెల 17న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ సినిమాలోని ‘ఉ అంటావా మావా ఉఊ అంటావా’ పాట గురించి ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. అంతకన్నా…
వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి..తనదైన ముద్రతోఅందమైన, అర్థవంతమైన,సమర్థవంతమైన పాటలనిమన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు..ఎన్నో వత్సరాల ప్రయాణం మాది, శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా వచ్చి…అతి తక్కువ కాలంలో..శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు…మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి..తన పాటల “పదముద్రలు ” నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి… రుద్రవీణ, స్వర్ణకమలం, బొబ్బిలిరాజాఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు…రేపు రాబోయే” రంగమార్తాండ ” కూడా..సీతారాముడు రాసిన పాటలకు…
వైవిధ్యమైన స్వరంతో పాటలు పాడుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు ప్రముఖ సింగర్ షాన్. ఇప్పుడు ఆయన పాపారావు బియ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోన్న ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం కోసం నటుడిగా మారారు. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇళయరాజా స్టూడియోలో ఓ పాట పాడిన ఈ సింగర్‌ను చూసి, పాత్రకు సరిపోతాడని భావించి తమ సినిమాలో నటించాలని చిత్ర దర్శక నిర్మాతలు కోరారు. శర్మన్ జోషి,…
కోట్లాదిమంది పెదాలపై మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఇప్పటికీ నాట్యం చేస్తూనే ఉంటాయి. వేయికి పైగా చిత్రాలకు స్వరాలు సమకూర్చిన ఇళయరాజా నేటికీ అలుపుసొలుపు లేకుండా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమా పాట ఎలా ఉండాలో అలతి పదాలతో వివరించారు ఇళయరాజా. అప్పుడే వికసించిన కుసుమంలా పాట ఉండాలంటారు ఇళయరాజా. అంతేకాదు… ఆ పాటను ఎప్పుడు విన్నా… అదే అనుభూతి శ్రోతలకు కలగాలంటారు. ఆయన పాటలలో అలాంటి తాజాదనం ఉంది కాబట్టే దశాబ్దాలు గడిచిన ఆ పాటలను…
(జూన్ 2న ఇళయరాజా బర్త్ డే)ఉన్నది సప్తస్వరాలే, వాటితో పలికే రాగాలెన్నో! ఉన్నది ఒక్కడే ఇళయరాజా, ఆయన పలికించిన మధురం ఎంతో! ఈ నానుడి తమిళనాటనే కాదు, తెలుగునేలపైనా విశేషంగా వినిపిస్తుంది. తన తరం సంగీత దర్శకుల్లో ఇళయరాజా లాగా అభిమానగణాలను సంపాదించిన వారు మరొకరు కానరారు. తెరపై ఇళయరాజా పేరు కనిపించగానే అభిమానుల ఆనందం అంబరమంటేది. దాదాపుగా స్టార్ హీరోల స్థాయిలో ఇళయరాజా పేరు మారుమోగి పోయింది. ఇక ఆయన సంగీతం సమకూర్చిన చిత్రాలతోనే ఎంతోమంది…