Joe Root : కెప్టెన్సీ వదిలి రూటు మార్చిన “రూట్”.. ఎట్టకేలకు సచిన్ రికార్డు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచు లో ఇంగ్లండ్ అదరగొట్టింది. మూడు టెస్టుల సిరీస్ లోని తొలి టెస్ట్ మ్యాచ్ లో రూట్ సెంచరీతో(115*) కదంతొక్కాడు. రూట్ సెంచరీతో ఇంగ్లండ్ జట్టు తొలి టెస్టులో న్యూజిలాండ్ పై విజయం నమోదు చేసింది. 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. 277 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగిన ఇంగ్లండ్ ఓ దశలో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా, రూట్ సమయోచితంగా ఆడి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో రూట్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
టెస్టుల్లో తక్కువ వయసులో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ గా మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ రికార్డ్ ను సమం చేశాడు. కుక్ 31 ఏళ్ల 157 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా, రూట్ కూడా సరిగ్గా 31 ఏళ్ల 157 రోజుల వయసులోనే ఈ రికార్డు నమోదు చేయడం విశేషం. ఇంగ్లండ్ క్రికెటర్లలో ఇద్దరు(కుక్, రూట్) మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. అలాగే, సచిన్ రికార్డును కూడా బద్దలుకొట్టాడు. సచిన్ 10 వేల పరుగుల మార్క్ ను 31 ఏళ్ల 326 రోజుల వయసులో అందుకున్నాడు.
Also Read
- Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
- Asian Para Games 2026 : భారత్ కు మరో స్వర్ణం.. స్ప్రింటర్ సిమ్రాన్‌కు స్వర్ణం..
- Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
- Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
అయితే 10 వేల పరుగుల మైలురాయి అందుకోవడానికి కుక్ కు 229 ఇన్నింగ్స్ లు అవసరం కాగా, రూట్ 218 ఇన్నింగ్స్ ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. వరల్డ్ వైడ్ గా చూస్తే 10 వేల పరుగులు సాధించిన వారి జాబితాలో రూట్ 14వ వాడు. ఇన్నింగ్స్ పరంగా వేగంగా 10 వేల పరుగులు సాధించిన వారి జాబితాలో రూట్ 10వ వాడు.
అయితే, టెస్ట్ కెరీర్ లో జో రూట్ కి ఇది 26వ సెంచరీ. రూట్.. 170 బంతుల్లో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోర్ లో 12 బౌండరీలు ఉన్నాయి. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 118 టెస్టులు ఆడిన రూట్.. 10వేల 015 పరుగులు చేశాడు.న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 132 పరుగులకు, రెండో ఇన్నింగ్స్ లో 285 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 141 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సెకండ్ ఇన్సింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది.
టెస్ట్ క్రికెట్ లో 10వేల పరుగులు చేసిన క్రికెటర్లు వీరే..
1. సచిన్ టెండూల్కర్ (భారత్) – 15,921
2. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 13,378
3. జాక్వస్ కలిస్ (సౌతాఫ్రికా) – 13,289
4. రాహుల్ ద్రావిడ్ (భారత్) – 13,288
5. అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్) – 12,472
6. కుమార సంగక్కర (శ్రీలంక) – 12,400
7. బ్రియాన్ లారా (వెస్టిండీస్) – 11,953
8. శివన్నారయణ చంద్రపాల్ (వెస్టిండీస్) – 11,867
9. మహేల జయవర్దనే (శ్రీలంక) – 11,814
10. అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) – 11,174
11. స్టీవ్ వా (ఆస్ట్రేలియా) – 10,927
12. సునీల్ గావస్కర్ (భారత్) – 10,122
13.యూనిస్ ఖాన్ (పాకిస్తాన్) – 10,099
14. జో రూట్ (ఇంగ్లండ్) – 10,015*
తాజావార్తలు
-
PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
-
Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
-
Fake Number Plates: నకిలీ నంబర్ ప్లేట్లకు చెక్.. 100 వాహనాలు సీజ్.!
-
Yadadri Thermal Plant : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లో మరో కీలక ఘట్టం
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!