ఈ ఏడాది జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ యొక్క నిర్వహణ హక్కులు మన బీసీసీఐకే ఉంది. కానీ మన భారత్ లో కరోనా కేసుల కారణంగా దీనిని బీసీసీఐ యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. అయితే ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో డెసిషన్ రివ్యూ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది ఐసీసీ. దాంతో మొదటిసారి టీ20 ప్రపంచ కప్ లో ఈ డీఆర్ఎస్ ను ఉపయోగించినట్లు అవుతుంది. అయితే ఈ టోర్నీలో…
యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ కు షాక్ తగిలింది. ఈ టోర్నీలో పాల్గొనాలంటే కొన్ని నిర్ణయాలు తప్పకుండ పాటించాలని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది అక్టోబర్ లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కు ఇప్పటివరకు 8 జట్లు అర్హత సాధించాయి. అందులో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక్కటి. ఈ పొట్టి ఫార్మాట్ లో ఎంతో బలవంతమైన జట్టుగా ఎదిగిన ఆఫ్ఘన్ ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్…
భారత్‌తో టెస్టు సిరీస్‌లో తలెత్తిన వివాదంపై ICC తలుపు తట్టింది… ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. ఈ విషయంలో తమకు సాయం చేయాలని ECB కోరింది. మ్యాచ్ రద్దవడం వల్ల నష్టపోతామంటున్న ECB, ఆ నష్టాన్ని ఎలాగైనా పూడ్చుకోవాలని చూస్తోంది. మరోవైపు టెస్ట్ రద్దుపై స్పందించిన రవిశాస్త్రి… తన వల్లే కరోనా వ్యాప్తి జరిగిందంటే ఒప్పుకోనన్నాడు. భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఐదవ మ్యాచ్ రద్దు వ్యవహారంపై ICCకి చేరింది. ఈ మ్యాచ్ భవితవ్యం సిరీస్ ఫలితంపై ఆధారపడడంతో…
ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ ను బీసీసీఐ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్ లో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో ఈ టోర్నీని యూఏఈకి మార్చింది బీసీసీఐ. అయితే తాజాగా ఈ ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 23 న ఈ టోర్నీ ప్రారంభం కానుండగా 24న టీం ఇండియా మొదటి మ్యాచ్ పాకిస్థాన్ తో తలపడుతుంది. ఆ తర్వాత 31న న్యూజిలాండ్ తో నవంబర్ 3న ఆఫ్ఘనిస్తాన్ తో…
ఏ సిరీస్ అన్నది కాదు.. అందులో భారత్, పాకిస్థాన్ ఉన్నాయా..? మరీ ముఖ్యంగా.. ఆ రెండు జట్లు ఎప్పుడు తలపటబోతున్నాయి అనే ఉత్కంఠ సగటు క్రికెట్ ప్రేమికుల్లో ఉంటుంది.. ఇక, భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే.. ఎప్పుడూ క్రికెట్‌ను అంతగా చూడనివారు కూడా ఆ రోజు ఆసక్తిగా వీక్షిస్తుంటారు.. ఇలా.. భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగితే బాగుంటుంది అని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల కోరికను టీ-20 వరల్డ్‌కప్ తీర్చబోతోంది… ఇంకో విషయం ఏంటంటే.. టీ20 వరల్డ్‌కప్‌లో…
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్-2లో సరికొత్త విధానానికి ICC ఆమోదముద్ర వేసింది. కొత్త పాయింట్ల పద్ధతిని ధ్రువీకరించింది. ఇకపై మ్యాచ్ గెలిస్తే 12, డ్రా అయితే 4, టై అయితే 6 పాయింట్లు లభిస్తాయని తెలిపింది. గత ఛాంపియన్‌షిప్‌లో ఒక సిరీసుకు 120 పాయింట్లు కేటాయించారు. రెండు మ్యాచులే ఉంటే… ఒక్కో మ్యాచుకు 60 వచ్చేవి. నాలుగు మ్యాచులుంటే కేవలం 30 పాయింట్లే లభించేవి. అయితే కరోనా కారణంగా మ్యాచులు జరగకపోవడంతో దీనిని మధ్యలోనే మార్చేశారు. పర్సంటేజీ విధానం…
టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై ఐసీసీకి బీసీసీఐ సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే.. కరోనా నేపథ్యంలో.. యూఏలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఇస్తూనే.. మ్యాచ్‌ల తేదీలను ఐసీసీ ప్రకటిస్తారనే రాజీవ్ శుక్లా వెల్లడించగా… ఇవాళ టోర్నీ నిర్వహణ, వేదికలపై ప్రకటన చేసింది ఐసీసీ.. కోవిడ్ నేపథ్యంలో.. మ్యాచ్‌ల నిర్వహణ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాలకు మార్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.. అక్టోబర్ 17వ…
ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే ఈసారి ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్(891) తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(886) రెండో స్థానానికి పడిపోయాడు. ఇక ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్(878) అదే మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. కానీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(814) ఒక స్థానం మెరుగుపరుచుకుని నాలుగో స్థానానికి రాగ… తాజాగా కివీస్ పైన రాణించని ఇంగ్లండ్ సారథి జో రూట్(797) ఐదో…
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యంపై నిర్ణయం ప్రకటించేందుకు బీసీసీఐకి నాలుగు వారాల సమయమిచ్చినా ఐసీసీ భారత్ లో టోర్నీ నిర్వహించకపోతే.. యూఏఈనే వేదికని చెప్పిందట. బీసీసీఐ కూడా దానికి అంగీకరించినట్టు సమాచారం. అయితే యూఏఈలో టోర్నీ నిర్వహిస్తే అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికలే కాకుండా.. నాల్గవ వేదికగా మస్కట్‌ను కూడా ఆ జాబితాలో చేర్చనున్నారట. అయితే ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచులను యూఏఈలోనే గత ఏడాది జరిగిన మూడు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ప్లాన్ చేసింది. ఐపీఎల్…