ICC New Rules: పురుషుల క్రికెట్‌లో ఐసీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ మేరకు సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని మెన్స్ కమిటీ సిఫారసులను చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (సీఈసీ) ఆమోదించింది. కొత్త నిబంధనలను అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం కరోనా సమయంలో రెండేళ్ల పాటు సలైవా (బంతిపై ఉమ్మి రుద్దడం)పై ఐసీసీ నిషేధం విధించగా ఇప్పుడు శాశ్వతంగా బ్యాన్ విధించింది. అటు టెస్టులు, వన్డేల్లో కొత్తగా వచ్చే బ్యాటర్…