ICC Announced 3 New Rules: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా మూడు రూల్స్‌ని సవరించింది. తరచూ వివాదాలకు తెరతీసిన సాఫ్ట్ సిగ్నల్, ఫ్రీ హిట్ బౌల్డ్ నిర్ణయాలతో పాటు హెల్మెట్ విషయంలో తప్పనిసరి నిబంధనని అమలులోకి తీసుకొచ్చింది. మొదట సాఫ్ట్ సిగ్నల్ గురించి మాట్లాడుకుంటే.. బౌండరీకి దగ్గరో, లేదంటే బంతి నేలను తాకినట్లు పట్టిన క్యాచ్‌ల విషయంలో తీసుకుంటే నిర్ణయం. ఇది ఎప్పుడు వివాదాస్పదం అవుతూనే వస్తోంది. తొలుత ఫీల్డ్ అంపైర్ అవుటిచ్చినా, దాన్ని మళ్లీ టీవీ (థర్డ్) అంపైర్‌కు నివేదిస్తారు. అప్పుడు నాటౌట్ అని తేలినా.. సాఫ్ట్ సిగ్నల్ ప్రకారం అవుటనే ప్రకటిస్తారు. ఇప్పుడు ఆ రూల్‌ని ఐసీసీ టాటా చెప్పేసింది. ఇప్పుడు టీవీ అంపైర్ తీసుకునే నిర్ణయాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.
World’s Oldest Dog: కుక్కకు గిన్నిస్ రికార్డు.. అంత స్పెషల్ ఏంటో?
రెండోది ఫ్రీ హిట్ బౌల్డ్.. ఇప్పటివరకూ ఫ్రీ హిట్‌కు బౌల్డ్ అయితే, అప్పుడు పరుగులు తీయడానికి వీలు ఉండేది కాదు. ఒకవేళ బంతి బౌండరీ లైన్‌వైపు పరుగులు తీసినా సరే, దాన్ని లెక్కలోకి తీసుకునే వారు కాదు. దాంతో ఫ్రీ హిట్ వృధా అయ్యేది. కానీ, ఇప్పుడు ఆ రూల్‌ని ఐసీసీ ఎత్తివేసింది. ఫ్రీ హిట్‌కు బౌల్డ్ అయినా సరే, పరుగులు తీసుకోవచ్చు. అది చట్టబద్ధమేనని ఐసీసీ ప్రకటించింది. పైగా.. ఈ పరుగులు ఎక్స్‌ట్రా కోటాలోకి వెళ్లవు, నేరుగా బ్యాటర్ ఖాతాలోకే వెళ్తాయి. ఒకరకంగా ఇది బ్యాటర్‌కి బంపరాఫర్ అని చెప్పుకోవచ్చు. ఇక మూడోది హెల్మెట్.. పేసర్లు బౌలింగ్ వేస్తున్నప్పుడు, బ్యాటర్లు తప్పకుండా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. తనకు నొప్పట్లేదని తీసివేయడానికి వీలు లేవు. అలాగే.. బ్యాటర్లకు చేరువగా మోహరించే ఫీల్డర్లు, కీపర్ సైతం హెల్మెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
WhatsApp Chat Lock: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక మరింత భద్రత..