Heavy Rain: హైదరాబాద్ మహా నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. గ్రేటర్ పరిధిలోని నార్త్, సౌత్ ప్రాంతాల్లో మరో 2 గంటల పాటు ఈ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, నాగోల్, దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట, హయత్ నగర్, చైతన్యపురి, హబ్సిగూడ, బషీర్ బాగ్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.
HYDRA Police Station : హైదరాబాద్ నగరంలో భారీ స్పందన పొందిన హైడ్రా (HYDRAA) ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రత్యేక విభాగానికి ఇటీవల ప్రభుత్వం మరిన్ని అధికారాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించినట్లుగా, త్వరలో ప్రత్యేక హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా, మే 8వ తేదీన ముఖ్యమంత్రి…
Hydraa: హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలోని కిస్మత్ పురలో రెండు కాలనీలను కలిపే రహదారికపై అడ్డంగా నిర్మించిన ప్రహారీ గోడను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. దీంతో పాటు సాయంత్రానికి అక్కడ సిమ్మెంట్ రోడ్డును వేశారు బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ అధికారులు.
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నేడు ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. చెరువు బఫర్ జోన్‌లోని నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. బఫర్ జోన్‌లోని 4 ఎకరాల ఖాళీ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను హైడ్రా కూల్చివేసింది. ఆ స్థలంలో ఉన్న వైన్స్‌ను తక్షణమే ఖాళీ చేయాలంటూ హైడ్రా అధికారులు ఆదేశించారు. కూల్చివేతల సందర్భంగా అధికారులకు భారీ బందోబస్తు చేపట్టారు. ఇటీవల భగీరథమ్మ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. భగీరథమ్మ చెరువు…
Hydra Commissioner: కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పాటు తర్వాత అక్రమంగా నిర్మించిన ఇండ్ల పై చర్యలు తప్పవనీ స్పష్టం చేశారు.
Ameenpur: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సుమారు 20 లే- అవుట్లకు గాను 5000 ప్లాట్లు మురికి నీటితో నిండి పోయి ఉందన్నారు.
Harish Rao: మూసి ప్రాంతంలో కూల్చివేతలు జరగకుండా మేము అడ్డం కూర్చుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలని తెలిపారు.
Harish Rao: పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వానికి పేదల ఆశీస్సులు ఉండాలని, వారి గోసలు ఉండకూడదని తెలిపారు.
Musi River Area: చైతన్యపురి సత్య నగర్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మూసీ రివర్ బెడ్ నిర్మాణాలు గుర్తించి రెవిన్యూ అధికారులు మార్కింగ్ చేపట్టారు. మార్కింగ్ చేస్తున్న అధికారులను అడ్డుకుంటున్న స్థానికులు.
Hydraa: రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డిలో పలు చోట్ల భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేత చేపట్టారు.