Hydraa: మల్కాపూర్ చెరువులో భవనం కూల్చివేత.. హోంగార్డుకు తీవ్ర గాయాలు
- రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి..
- భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hydraa: రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డిలో పలు చోట్ల భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేత చేపట్టారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువు మధ్యలో అక్రమంగా నిర్మించిన ఇంటిని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. చెరువు నీటి మధ్యలో నిర్మించిన భవనాన్ని బ్లాస్టింగ్ చేసే క్రమంలో భవనం నుంచి ఒక్కసారిగా ఒక రాయి స్పీడ్ గా వచ్చి సమీపంలో నిలబడి వున్న హోంగార్డు గోపాల్‌కు తగిలింది. దీంతో గోపాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన తలపై నుంచి తీవ్రంగా రక్తం కారడంతో అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. గోపాల్ పరిస్థితి నిలకడగానే ఉందని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రథమ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఆపరేషన్ మూసీ జోరుగా సాగుతోంది. మూసీ ప్రక్షాళనలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మూసీ వద్ద ఆక్రమణలు తొలగించిన వెంటనే సుందరీకరణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా మూసీ నిర్వాసితుల గుర్తింపు కోసం సర్వే కొనసాగుతోంది. పునరావాసం కోసం అధికారులు పేదల వివరాలను సేకరించడం ప్రారంభించారు. పునరావాసం తర్వాతే ఇళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మూసీ నది ఆక్రమణల నుంచి బయటపడేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. మూసి నదిలో 2,166 ఇళ్లను అధికారులు గుర్తించారు. అయితే హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఎక్కువ ఆక్రమణలను అధికారులు గుర్తించారు.
Jagtial Crime: ఎస్సై కొట్టిందని నిప్పంటించుకున్న వ్యక్తి.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన..
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
- Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్‌పై కీలక ఆదేశాలు.!
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!