ఫాల్కన్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన చేసింది. ఈ కేసులో ఈడీ సంచలన విషయాను వెల్లడించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చార్టర్డ్ ఫ్లైట్ ని సీజ్ చేసామని ఈడీ అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఫ్లైట్ ని ఎయిర్ పోర్టులో స్వాధీన పరచుకున్నామన్నారు. ఫాల్కన్ కేసులో ప్రధాన నిందితుడు అమర్ దీప్ అమెరికాకు చెందిన కంపెనీ పేరు మీద చార్టెడ్ ఫైట్ ని కొనుగోలు చేశాడన్నారు.
Also Read:Child Trafficking Case: జోరుగా చిన్నారుల అక్రమ రవాణా.. 6నెలల్లో 20 పసి పిల్లల విక్రయం..
1.6 మిలియన్ పౌండ్స్ చెల్లించి అమర్ దీప్ ఫ్లైట్ ని కొనుగోలు చేశాడు. ఫ్లైట్లో ఇంటీరియర్ కోసం మూడు కోట్ల రూపాయలు అమర్ దీప్ చెల్లించాడు. అమర్ దీప్ కొనుగోలు చేసిన ఫ్లైట్ ని ఎయిర్ అంబులెన్స్ గా వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అమర్ దీప్ అరబ్ దేశాల నుంచి ఇండియాకి ఎయిర్ అంబులెన్స్ గా వాడుతున్నట్లు ఈడీ గుర్తించింది. బిజినెస్ ట్రిప్పుల కోసం కూడా అమర్ దీప్ చార్టెడ్ ఫ్లైట్ ని వాడుతున్నట్లు గుర్తించారు.
Also Read:Hyderabad: పెళ్లయిన నెల రోజులకే.. నవవధువు ఆత్మహత్య
ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ హ్యాండ్లింగ్ ఛార్జీల కోసం అమర్ దీప్ మరొక కంపెనీ ఏర్పాటు చేశాడు. విదేశీ వ్యక్తులతో కలిసి అమర్ దీప్ ఎయిర్ అంబులెన్స్ వ్యాపారం చేస్తున్నాడు.
కాగా నిబంధనలకు విరుద్ధంగా హవాలా విదేశీ ద్రవ్యం వ్యాపారంలో అమర్ దీప్ పై కేసు నమోదైంది. అమర్ దీప్ పై పీఎంఎల్ఏతో పాటు హవాలా సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది.