Telangana Heatwave Alert: మార్చి నెల ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Child Trafficking Case: హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి వందన అనే మహిళను అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాదులో అమ్మినట్లు గుర్తించారు.
Indira Mahila Shakti: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025 విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్త్ కర్తవ్యాలను నిర్దేశిస్తూ ఇందిరా మహిళ శక్తి మిషన్ - 2025..
Hyderabad: హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో మద్యం మత్తులో కారు బీభత్సం సృష్టించింది. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ దగ్గర ద్విచక్ర వాహన దారుని ఢీకొట్టిన కారు.. దీంతో పాటు మద్యం మత్తులో యువతులు హల్ చల్ చేశారు.
మరో మూడు కేసుల్లో రాజా సింగ్ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. గతంలో విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ అనుమతి ఉల్లంఘనకు సంబంధించిన మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు బీజేపీ శాసనసభ్యుడు టి. రాజా సింగ్ను నిర్దోషిగా ప్రకటించింది. మంగళ్హాట్, షాహినాయత్గంజ్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.
అతి వేగం ప్రమాదకరం… అనే మాటలు దాదాపు ప్రతి హైవే మీద చదువుతాం. ఎందుకంటే వేగంగా డ్రైవ్ చేసి ప్రమాదానికి గురికావడం కంటే తక్కువ వేగంతో సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ఉత్తమం. ఇది ఆ పదబంధం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. కానీ, కొందరు వాహనదారులు మాత్రం ఇవేవీ పట్టించుకోరు. దాంతో భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఇందుకు నిదర్శనంగా జరిగిన ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ…
ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ లింగంపల్లికి చెందిన సోను (21) డిగ్రీ స్టూడెంట్. హౌసింగ్ బోర్డ్ కాలనీ, బృందావనం కాలనీకి చెందిన అంబిక (21) ఎల్ఎల్బీ స్టూడెంట్. ఇద్దరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.
నానక్రామ్ గూడలోని ఖాజాగూడ పెద్ద చెరువుతో పాటు.. నెక్నాంపూర్ లోని ఇబ్రహీంబాగ్ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఖాజగూడ చెరువులోకి మురుగు నీరు చేరకుండా కాలువ డైవర్షన్ పనులు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. నెక్నాంపూర్ లోని ఇబ్రహీంబాగ్ చెరువు సుందరీకరణ పనులు స్పీడప్ చేయాలని దత్తత తీసుకున్న సంస్థను కోరారు.
Cyber Crime: హైదరాబాద్ నగరంలో కాల్ సెంటర్ల స్కాం వెలుగులోకి వచ్చింది. పే పాల్ వినియోగిస్తున్న కస్టమర్స్ డేటా చోరీ చేసినట్లు గుర్తించారు. విదేశాల్లో ఉంటున్న కస్టమర్స్ టార్గెట్ గా ఈ స్కాం చేశారు. దీంతో పాటు హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలను సరిచేస్తామంటూ మోసాలు చేసి.. బ్యాంకు అకౌంట్, డెబిట్, క్రెడిక్ కార్డులు వివరాలు సేకరంచి ఖాతాల్లో నగదు కాజేస్తున్నారు నిందితులు.
Sirisha Murder Case: మలక్ పేటలో శిరీష హత్య కేసులో సరిత క్రూరత్వంపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రొఫైల్ పిక్ లో ఆమె అసలు రంగు బయటపడింది. నన్ను తట్టుకుని నిలవాలంటే మూడే దారులు.. మారిపోవాలి, పారిపోవాలి, లేదా సచ్చిపోవాలి అంటూ సవాల్.. నువ్వు సవాలు విసరకు.. నేను శవాలు విసురుతా అని పోస్టులో సరిత పేర్కొనింది.