Holi 2025 : హోలీ రంగుల వెనుక మత్తు కలర్.. గంజాయి కలిపిన కుల్ఫీ, స్వీట్స్ స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Holi 2025 : హోలీ అంటేనే రంగురంగుల పండుగ ..ఈ పండుగ అంటానే మజా ఉంటుంది ..ఆ మజా వెనకాల కిక్కు ఒకటి ఉంటుంది ..మన భాషలో చెప్పాలంటే గంజాయి. గంజాయిని నేరుగా తీసుకుంటే అది నేరమవుతుంది.. అయితే హోలీ సమయంలో కిక్ వచ్చే రూపంలో తీసుకుంటే అది తిను పదార్థం అవుతుంది.. పాత బస్తీలో బేగంబజార్ దూలిపేట కార్వాన్ లాంటి ప్రాంతాల్లో కిక్కు వచ్చే గంజాయిని వివిధ రకాలుగా తయారుచేసి అమ్ముతుంటారు.. దానిమీద ఎప్పుడు అధికారులు ఫోకస్ పెట్టారు.. కానీ ఈసారి అధికారులు ఫోకస్ పెట్టడంతో పెద్ద మొత్తంలో కిక్ ఇచ్చే గంజాయి అలియాస్ బుంగ్ ను స్వాధీనపరుచుకున్నారు.. ఐస్ క్రీమ్, కుల్ఫీ, స్వీట్ బాల్స్ తోపాటు బాదాం మిల్క్ లలో గంజాయిని కలిపి విక్రయాలు చేస్తున్నారని తెలిసి ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి స్వాధీనపరచుకున్నారు. కుల్ఫీ ఐస్ క్రీమ్ స్వీట్ బాల్స్ బాదం మిల్క్ తయారీ నిర్వాహకులను అధికారులు అరెస్టు చేశారు. హోలీ రెండు రోజుల్లో వీటిని పెద్ద మొత్తంలో అమ్ముతారని అధికారులు చెప్పారు. పెద్ద మొత్తంలో తయారు చేస్తున్న గంజాయి తిను బండారాలను అధికారులు సాధన పరుచుకొని వాళ్లపైన కేసులు పెట్టారు. అయితే 24 గంటల పాటు కిక్ ఇచ్చే విధంగా ఈ బంగ్ ను తయారు చేస్తారు. గంజాయితో తయారుచేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ తో పాటు గంజాయి బాల్స్ ను స్వాధీనం చేసుకున్న ఎస్టిఎఫ్ పోలీసులు తెలిపారు. హోలీ అంటేనే రంగుల పండుగ. ఒళ్లంతా రంగులు చల్లుకొని హోలీ పండుగ జరుపుకొని ముక్క వైపు తెలంగాణ ప్రజలు పరుగులు తీస్తారు. హైదరాబాదులో విభిన్న రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు విభిన్న రీతుల్లో హోలీ సంబరాలు జరుపుకుంటారు.
కానీ.. తెలంగాణ ప్రజల హోలీకి భిన్నంగా లోయర్ దూల్పేట్ లోని మల్చిపురాలో కుల్ఫీ ఐస్ క్రీమ్ లో గంజాయి, బర్ఫీ సీటులో గంజాయి, సిల్వర్ కోటెడ్ బాల్స్ లో గంజాయి వినియోగిస్తూ సంబరాలు జరుపుకుంటున్ సమాచారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టిఎఫ్ పోలీసుల దృష్టి పడింది. గంజాయి ముసుగులో జరుగుతున్న హోలీ వేడుకల్లో దాడులు నిర్వహించి గంజాయి తో తయారైన వాటిని కుల్ఫీ ఐస్ క్రీమ్ ను, బర్ఫీ స్వీటును, సిల్వర్ కోటెడ్ బాల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిత్యం కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి గంజాయితో గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. గంజాయితో తయారైన వీటిని స్వాధీనం చేసుకొని అమ్మకాలు నిర్వహించే సత్యనారాయణ పై కేసు నమోదు చేసినట్లు ఎస్టిఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
చికెన్ సెంటర్‌లో గంజాయి విక్రయం కలకలం రేపింది. పోలీసుల తనిఖీలో 4 కిలోల గంజాయి పట్టుబడింది.గంజాయి తీసుకొచ్చిన వ్యక్తి పరారు కాగా విక్రయించే యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో చోటుచేసుకుంది. బిహార్ రాష్ట్రానికి చెందిన మహబూబ్ అనే యువకుడు అజీజ్‌నగర్‌లో ఓ గదిలో అద్దెకు ఉంటూ అదే ప్రాంతంలోని ఏజీఆర్ చికెన్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. చికెన్ సెంటర్‌లో పనిచేస్తూనే అదనపు సంపాదన కోసం తాను అద్దెకు ఉండే గదిలో గంజాయి విక్రయిస్తున్నాడు. కాగా బుధవారం నగరంలోని ధూల్‌పేట్ నుంచి 4 కిలోల గంజాయి తీసుకొచ్చి చికెన్ సెంటర్‌లో మహబూబ్‌కు విక్రయించాడు. ముందుగానే పసిగట్టిన పోలీసులు చికెన్ సెంటర్ వద్దకు రాగానే గంజాయి తీసుకొచ్చిన వ్యక్తి పారిపోయాడు. పోలీసులు చికెన్ సెంటర్‌లో తనిఖీ చేయగా కిలోల గంజాయి లభించింది. అక్కడే ఉన్న మహబూబ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ధూల్‌పేట్ నుంచి తెచ్చే గంజాయిని తాను గదిలో పెట్టి అవసరమైనవారికి విక్రయిస్తానని అంగీకరించాడు. గంజాయిని స్వాదీనం చేసుకున్న పోలీసులు పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!