Minister Komatireddy: సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు వికాస్ రాజ్, హరి చందన, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల నిర్మాణం ఆలస్యం అవుతుండడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కుంటిసాకులతో నిర్మాణాలను ఆలస్యం చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంట్రాక్టర్లతో పని చేయించడం కూడా రాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Vishwambara : “జై శ్రీ రామ్” నినాదంతో.. దూసుకుపోతున్న చిరంజీవి ‘విశ్వంభర’ సాంగ్..
అయితే, సనత్ నగర్ లో ఆస్పత్రిని జూన్ 2వ తేదీన ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నా.. పనులు ఎందుకు వేగంగా కొనసాగడం లేదని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఎప్పటి వరకు 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం పూర్తి చేస్తారో టెక్నికల్ గా అంచనా వేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఆసుపత్రులకు సంబంధించిన నిర్మాణ పనులను ఆర్ అండ్ బీ, వైద్య పరికారాలను వైద్యారోగ్య శాఖ ఎస్టిమేట్ వేసుకోవాలి అని సూచించారు. ప్రతీ వారం ఆసుపత్రుల నిర్మాణ పురోగతిపై సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి.