కేసీఆర్ కుటుంబంలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయని, ఇక నుంచి ఆ పార్టీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చంటూ కొద్ది రోజులుగా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ఒకరు, శాసనసభాపక్షం చీలిపోతుందని మరొకరు మాట్లాడుతున్నారు. దీంతో... బీఆర్ఎస్ కేడర్‌లో ఏదో తెలీని ఆందోళన, అంతకు మించిన గందరగోళం. అదే సమయంలో మరో ఆసక్తికరమైన చర్చ సైతం నడుస్తోంది.
Theater Strike : హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మే 24, 2025 శనివారం ఉదయం ప్రొడ్యూసర్స్ మరియు ఎగ్జిబిటర్స్ మధ్య ఒక కీలక జాయింట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశం అనంతరం ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ నిర్వహించి, చర్చల ఫలితాలను మరియు తీసుకున్న నిర్ణయాలను అధికారికంగా ప్రకటించనుంది. ఈ మీటింగ్‌లో ప్రధానంగా థియేటర్ రెంటల్ విధానం, ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న పర్సెంటేజ్ ఆధారిత రెవెన్యూ షేరింగ్ మోడల్‌పై చర్చ జరగనుంది. సమాచారం ప్రకారం,…
Miss World 2025: 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన “హెడ్-టు-హెడ్ చాలెంజ్” ఫినాలే సందర్భంగా.. వివిధ ఖండాల నుంచి వచ్చిన అందాల కిరీటధారులు తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఈ పోటీ సందర్భంగా జడ్జీలు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రతకు సంబంధించి కంటెస్టెంట్స్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. తెలంగాణ రాష్ట్రం మహిళల భద్రతను హక్కుగా గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని…
AI : రక్త పరీక్ష అంటే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది – సూదితో రక్తం తీసే ప్రక్రియ. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, నడుమున్న వయసువారు దీనికి కొంచెం భయపడుతుంటారు కూడా. కానీ ఇప్పుడు ఆ భయాన్ని పూర్తిగా తొలగించే దిశగా ఆరోగ్యరంగం ముందడుగు వేసింది. హైదరాబాదులోని ప్రసిద్ధ ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్ హాస్పిటల్ దేశంలోనే తొలిసారిగా సూదిరహిత రక్త పరీక్షలు చేసే సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఇది కేవలం వైద్యరంగంలోనే కాదు, టెక్నాలజీ వినియోగంలోనూ ఒక విప్లవాత్మక ముందడుగుగా…
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా సూపర్ డైరెక్టర్ అట్లీ కలయికలో ఓ బ్లాక్‌బస్టర్ మూవీ రూపొందుతోందన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ కాంబో కోసం ఇండియన్ సినీ లవర్స్‌తో పాటు గ్లోబల్‌గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అట్లీకి ఇది ఫస్ట్ తెలుగు మూవీ కాగా, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ సమర్పణలో ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కనుంది. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో…
ఇటీవలి కాలంలో చిన్న చిన్న విషయాలకే మానసిక వేధనకు గురై షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే తరహాలో ఓ వివాహిత ఇంట్లో చోరీకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదని తీవ్ర మనస్థాపానికి గురైంది. కొడుకుతో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చింతల్‌కుంటకు చెందిన సుధేష్ణకు(28) నాలుగేళ్ల కిందట అమ్మదయ కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్‌కుమార్ ఉన్నాడు.…
హయత్ నగర్ కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు డీసీఎంను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు నుజ్జు నుజ్జైంది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో హాస్పిటల్ కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృత దేహాలు…
Marriage Scam: హైదరాబాద్ నగరంలో మరో కొత్త రకమైన మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో వృద్ధులను టార్గెట్ చేస్తూ ఇద్దరు మహిళలు మోసాలకు పాల్పడుతున్న ఘటన మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సంపన్నులు, రిటైర్మెంట్ అయినా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారు మ్యారేజ్ బ్యూరో పేరుతో ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తున్నారు ఇద్దరు మహిళలు. తాజాగా ఓ వృద్ధుడు వీరి ఉచ్చులో పడ్డాడు. పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆయన పెళ్లి…
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్ల కుట్నను తెలంగాణ, ఏపీ పోలీసులు భగ్నం చేసిన విషయం విదితమే.. విజయనగరంలో ఒకరిని, హైదరాబాద్‌లో మరొకరని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఈ కేసులో ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది.. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు వెలుగు చూడగా.. ఉగ్రవాద భావజాలం కలిగిన సిరాజ్ నుంచి అనేక ఆసక్తికర విషయాలు సేకరించారు పోలీసులు.. సిరాజ్ నాలుగు టార్గెట్లు పెట్టుకున్నట్టు పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం.. దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి.. యువతను మతోన్మాదులుగా మార్చాలి..
HYDRA : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఆక్రమిత నిర్మాణాలను తొలగిస్తూ చర్యలు చేపట్టారు. మొదటగా కూకట్పల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ పరిధిలోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు ధర్మయుద్ధం ప్రారంభించారు. సర్వే నంబర్ 145లో ఉన్న 9 ఎకరాల లేఅవుట్‌ను అన్‌రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆధారంగా ఆక్రమించారని, స్థానికులు ఆరోపించారు. ఈ ప్రాంతంలో మొత్తం 79 ప్లాట్లు, వాటికి సంబంధించిన పార్కులు, రహదారులు…