ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఒక యువకుడిపై అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి, ఈ రోజు ఉదయం తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటులలో ఒకరైన కోట శ్రీనివాసరావు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చాలామంది ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగానే దర్శక ధీరుడు రాజమౌళి కూడా కోట శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read:Kota Srinivas Death : ‘కోట’ రాజకీయాలను ఎందుకు వదిలేశాడు..?
అయితే, ఇదిలా ఉండగా, రాజమౌళి బయలుదేరుతూ కారు ఎక్కబోతున్న సమయంలో ఒక యువకుడు పదే పదే సెల్ఫీ తీసేందుకు ప్రయత్నించాడు. ముందు తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన రాజమౌళిపై ఆ యువకుడు మీదకు వెళ్లి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేయడంతో రాజమౌళి అసహనం వ్యక్తం చేశారు. “ఎక్కడకొచ్చి ఏం చేస్తున్నావు?” అంటూ ఆయన ప్రశ్నించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read:Kota Srinivas Death : నటనతో ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా చేశాడు.. ఆర్.నారాయణ మూర్తి కామెంట్స్
నిజానికి, రాజమౌళి మాత్రమే కాదు, చాలామంది సెలబ్రిటీలు ఈ సెల్ఫీల వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సందర్భం ఏమిటో కూడా చూడకుండా కొంతమంది అత్యుత్సాహంతో సెల్ఫీలు తీసేందుకు ప్రయత్నించడంతో సెలబ్రిటీలు ఇలా అసహనం వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాస్తయినా విచక్షణ ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎదురవవు కదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.