Home
Hyderabad
Hyderabad News
-
రేపు యాదాద్రికి సీజేఐ ఎన్వీ రమణ… గవర్నర్, సీఎం కూడా..
భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు సీజేఐ ఎన్వీ రమణ.. తన కుటుంబ సభ్యులతో కలిసి.. గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన.. శుక్రవారం రోజు మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు.. ఆ తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన ఆయనకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్, మంత్రులు స్వాగతం పలికితే.. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు.. ఇక, ఈ సందర్భంగా రాత్రి గవర్నర్.. రాజ్‌భవన్‌లో విందు… -
ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా
మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఇవాళ ఉదయం అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించిన ఆయన.. అనంతరం అసెంబ్లీకి వెళ్లి.. అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖను అందజేశారు.. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలేఖను సమర్పించారు ఈటల రాజేందర్… ఇక, ఇప్పటికే బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసిన ఈయన.. ఈనెల 14నవ తేదీన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ… -
నియంతృత్వ పాలనకు ఘోరి కట్టడమే అజెండా-ఈటల
తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరి కట్టడమే నా అజెండా అని ప్రకటించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఇప్పటికే టీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఆయన.. ఇవాళ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.. అంతకు ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో జరిగే ఉప ఎన్నికలు కురుక్షేత్రంగా అభివర్ణించారు.. అక్కడ కౌరవులు, పాడవులకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు.. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని ఈ సందర్భంగా… -
నేడు పెరిగిన బంగారం, వెండి ధరలు..
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి. బంగారం దిగిరావడంతో భారీ ఎత్తున కొనుగోలు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. అయితే ఈరోజు మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 46,100 కి… -
మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు
ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90 కాగా, డీజిల్ ధర రూ.94.82 చేరింది. ఈ జూన్ నెలలో ఇప్పటివరకు ఆరు సార్లు ఇంధన ధరలుపెరగ్గా.. మే 4వ తేదీ నుంచి… -
కేసీఆర్ కీలక నిర్ణయం.. ఇక, పల్లె, పట్టణ ప్రగతి పనుల ఆకస్మిక తనిఖీలు
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ మధ్యే గాంధీ ఆస్పత్రిని, వరంగల్ ఎంజీఎంను సందర్శించి కోవిడ్ బాధితులను పరామర్శించి భరోసా కల్పించిన ఆయన.. ఇప్పుడు మరింత దూకుడు పెంచుతున్నారు.. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును.. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఈ నెల 19 వ తేదీ తర్వాత ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించనున్నారు.. ఇక, ఇందులో భాగంగా.. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల క్షేత్రస్థాయి పనితీరును సమీక్షించడానికి… -
హైదరాబాద్‌లో భారీ వర్షం.. రేపు, ఎల్లుండి కుండపోత..!
తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఇక, హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూనే ఉంది.. మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో.. సాయంత్రం మరికొన్ని ప్రాంతాల్లో.. రాత్రికి ఇంకొన్ని ప్రాంతాల్లో అన్నట్టుగా వర్షం దంచికొట్టింది.. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.. వరుసగా మూడు రోజుల పాటు.. అంటే ఈ నెల 12, 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ నుంచి… -
బీజేపీ గూటికి రమేష్ రాథోడ్, ఆశ్వద్ధామరెడ్డి..!
తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ.. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.. ఇందులో భాగంగా కొంతమంది నేతలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరగా.. తాజాగా, టీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇవాళ ఈటల రాజేందర్‌తో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్… -
బెంగాల్ తరహాలో తెలంగాణపై బీజేపీ ఫోకస్..!
తెలంగాణపై క్రమంగా ఫోకస్ పెంచుతోంది భారతీయ జనతా పార్టీ.. వరుసగా కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో పర్యటిస్తూ.. రాష్ట్ర నాయకత్వాన్ని అలర్ట్ చేస్తోంది.. ఇక, పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలంగాణపై కూడా దృష్టి పెట్టబోతున్నాం అని తెఇపారు ఆ పార్టీ నేత శివ ప్రకాష్… హైదరాబాద్‌లో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్లలో పార్టీని బలోపేతం చేయాలి.. రాష్ట్ర నాయకులతో ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతా… మీ మనసులో మాట అప్పుడు చెప్పండి అని… -
ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు..! అంతా పాస్..!
తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించాల్సిన టెన్త్, ఇంటర్ పరీక్షలు కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు.. షెడ్యూల్ ప్రకారం జులైలో పరీక్షలు జరగాల్సి ఉండగా.. పరీక్షలపై నివేదిక పంపించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది ప్రభుత్వం.. రెగ్యులర్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షలు రద్దు చేయాలని రిపోర్ట్ ఇచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు.. అయితే, దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.. గతేడాది కూడా రద్దు…
తాజావార్తలు
-
YS Jagan: మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ!
-
India vs England: రోహిత్, కోహ్లీ ఉన్నంత మాత్రాన గెలవలేం.. టీమిండియాను వేధిస్తున్న ఈ 4 కీలక ప్రశ్నలు!
-
OG 2: ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి?
-
Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. ‘డిగ్గర్’ ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!