తెలంగాణ సీఎం కేసీఆర్‌ది ధృతరాష్ట్ర కౌగిలి అంటూ కామెంట్ చేశారు బీజేపీ నేత ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్.. టీఆర్ఎస్ నుంచి వలసలపై స్పందించిన ఆయన.. ఆలే నరేంద్రను వెళ్లకొట్టారు, విజయ శాంతి, స్వామి గౌడ్ వంటి ఎంతో మందిని బయటకు పంపించారు.. ఇప్పుడు ఈటల వంతు వచ్చిందన్నారు.. మధుసూదనాచారిని కేసీఆరే ఓడగొట్టారంటూ విమర్శించిన ఆయన.. ఇక, మిగిలింది హరీష్ రావే!.. హరిష్ రావుకు కూడా అనేక అవమానాలు జరిగాయని చెప్పుకొచ్చారు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులు ఎందుకు పార్టీని వీడుతున్నారు? అని ప్రశ్నించిన ప్రభాకర్.. తెలంగాణ ఉద్యమంలో లేనివాళ్లే కేసీఆర్ ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారని మండిపడ్డారు.. నీ జీతగాల్లు తప్ప పార్టీలో ఉన్న ఉద్యమకారులు ఎవరు నీకు మద్దతుగా మాట్లాడం లేదన్న ఆయన.. తెలంగాణ రాజకీయ సమీకరణాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని తెలిపారు.. గత రెండు రోజులుగా అధికార పార్టీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని.. వ్యాక్సిన్ విషయంలో గ్లోబల్ టెండర్లు తుస్ మన్నాయని ఎద్దేవా చేశారు..
రాష్ట్రంలో ఉచిత వ్యాక్సినేషన్ జరుగుతుందంటే అది కేంద్రం వల్లనే అన్నారు ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్.. కేంద్రం రెండు నెల క్రితం ఉచిత రేషన్ ఇచ్చినా.. జూన్ వరకు పంపిణీ చేయలేదని ఆరోపించిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం పాలన చేయడం లేదు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కుటుంబం తప్ప ఎవరూ కనపడటం లేదని ఫైర్ అయ్యారు. ఇక, తెలంగాణలో ఆ నాలుగు నియోజకవర్గాలే కనపడుతున్నాయి.. కొడుకు కేటిఆర్ మాత్రమే కనడుతున్నారు. అవినీతి ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులపై ఎందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.. మీ పాలన సక్రమంగా ఉందని మీరు భావిస్తే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్.