దేశంలో రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఆందోళనలు చెందుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి శ్రేణులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నాచౌక్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీగా తరలివెళ్లి రాజ్‌భవన్ వద్ధ నిరసన తెలపాలని నిర్ణయం తీసుకుంది.
Read: ‘మా’ కాంట్రవర్సీ : బాలయ్య కామెంట్స్ పై నాగబాబు స్పందన
దీంతో ధర్నాచౌక్ వద్ధకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నాయి. అయితే, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. దీంతో ధర్నాచౌక్ వద్ధ ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజ్‌భవన్ గేటుకు పార్టీ జెండాను కట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తలు నెలకొన్నాయి.