వాట్సాప్ చాటింగులను పరిశీలిస్తున్న పోలీసులు.. వివరణ ఇచ్చిన సీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో పోలీసులు గంజాయిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా సిటీ మొత్తం పోలీసులు జల్లెడ పడుతున్నారు. టూవీలర్‌పై వెళ్తున్న కొంతమంది యువకులను ఆపి తనిఖీలు చేస్తున్నారు. యువకుల మొబైల్ చాటింగులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంతో తమ ప్రైవసీకి పోలీసులు భంగం కలిగిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ అంశంపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరణ ఇచ్చారు. నిందితుల కదలికలు, నేరస్థుల అనుచరులపై నిఘా పెట్టేందుకే పలువురి మొబైల్ ఫోన్లను సైతం పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు.
Read Also: హిందూపురంలో విజిలెన్స్ దాడులు
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఇద్దరు గంజాయి సప్లై చేస్తున్న వారిని టాస్క్ ఫోర్స్, సివిల్ పోలీసులు అరెస్టు చేశారని సీపీ అంజనీకుమార్ తెలిపారు. నరసింగ్ సింగ్, రామవత్ రమేష్‌ను అరెస్ట్ చేశామన్నారు. వీరు ఇద్దరికి వేరే రాష్ట్రాలతో లింక్స్ ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇద్దరి నుంచి 70 కిలోల గంజాయితో పాటు ఆటోను సీజ్ చేశామన్నారు. గంజాయి కొనుగోలు అంతా గూగుల్‌పే ద్వారా చెల్లిస్తున్నట్లు తేలిందన్నారు. 2021 లో 114 పీడీ యాక్ట్‌లు నమోదు చేయగా… ఇందులో 31 మంది డ్రగ్స్ కేసుల్లో ఉన్నవారు ఉన్నారని సీపీ తెలిపారు. అటు ఏదైనా కేసులో టెక్నికల్‌గానూ విచారణ చేయాల్సి ఉంటుందని సీపీ అంజనీకుమార్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అన్ని యూనివర్సిటీల కంటే వాట్సాప్ యూనివర్సిటీ చాలా పెద్దదన్నారు. హైదరాబాద్ నుంచి ప్రతిరోజు 50వేల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయని, ప్రతి వీడియోపై పోలీస్ నిఘా అంటే కొంత కష్టమేనన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తను గుడ్డిగా నమ్మవద్దని సీపీ సూచించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు