పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా నగరంలో ఎక్కడో ఒక చోట వ్యభిచార దండాలు నడుస్తూనే ఉన్నాయి. అమాయకులైన ఆడపిల్లలకు డబ్బు ఆశచూపి ఈ రొంపిలోకి దింపుతున్నారు. తాజాగా కూకట్ పల్లిలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు రైడ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు.
వివరాలలోకి వెళితే హైదరాబాద్ కేపీహెచ్‌బీకాలనీలోని రోడ్డు నెంబర్ 4 లో గల ఒక ఇంటిని బి.రాజు, నూర్‌పాషా కాసింబీ అనే ఇద్దురు వ్యక్తులు అద్దెకు తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇంటికి ఒక మహిళను తీసుకొచ్చి వ్యభిచార దందాను మొదలుపెట్టారు. ఇక రోజు ఆ ఇంటికి ఎంతోమంది మగవారు వస్తూ పోతూ ఉండడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పక్కా సంచారమే అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిర్వాహాకులిద్దరితో పాటు మహిళను, శేరిలింగంపల్లికి చెందిన విటుడు కృష్ణారెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు.