హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఈనెల 12న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 22 వరకు కొనసాగనుంది. కార్తీక మాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతుండటంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాలకు 16 ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అధికారులు…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అడుగడుగునా బండిని అడ్డుకోవడం.. వాగ్వాదాలు, తోపులాటలు, రాళ్ల దాడులు, కోడిగుడ్లు విసరడం లాంటి ఘటనలు చర్చగా మారాయి.. అయితే.. ఈ పరిణామాలపై స్పందించిన రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ధాన్యం సేకరణపై పాలసీ చెబితేనే బండి సంజయ్‌ని తిరగనిస్తాం అన్నారు.. బండి సంజయ్‌ను తెలంగాణ రైతుల తరపున వెంటాడతాం… వేటాడుతామన్న ఆయన.. నల్గొండ రైతులపై దాడులు చేసిన…
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. వివిధ సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు.. పాదయాత్ర, దీక్షలు, ధర్నాలు.. ఇలా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక, నిరుద్యోగ సమస్యను పోరాట ఆయుధంగా తీసుకున్న వైఎస్ షర్మిల.. ప్రతీ మంగళవారం ఒక ప్రాంతాన్ని ఎంచుకుని నిరుద్యోగ దీక్షలు చేస్తున్నారు.. ఉన్నత చదువులు చదవి ఉద్యోగం దొరకక ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలను పరామర్శించడం.. ఆ తర్వాత ఒక్కరోజు దీక్ష చేసి..…
కరోనా కాలంలో పెరిగిన బంగారం ధరలు ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని అనుకునే లోగా క్రమంగా పెరగడం మొదలుపెట్టాయి. గత కొన్ని రోజులుగా పుత్తడి ధరలు పరుగులు తీస్తూనే ఉన్నది. ఇప్పటికే యాభైవేలు దాటిపోయింది. ఇక సోమవారం రోజున కూడా ఈ ధరలు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రేట్లు ఇలా ఉన్నాయి. Read: మెట్టుదిగిన తాలిబన్: ఏ దేశంతోనూ మాకు… 10 గ్రాముల 22…
బంజారాహిల్స్ పరిధిలో ఉన్న కేబీఆర్ పార్క్ లో ఉదయం, సాయంత్రం చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో కేబీఆర్ పార్క్ లో కేవలం వాకింగ్ చేయడం మాత్రమే కాదు నేరాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కేబీఆర్ పార్క్ వద్ద సినీ నటి పై దాడి జరిగింది. చౌరాసియా వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని ఆగంతకుడు దాడి చేసి, ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నం చేశాడు.…
సైబర్ నేరాలపై ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. ఎంత హెచ్చరిస్తున్నా ప్రజలు మాత్రం మారడం లేదు. నిత్యం సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. దీంతో నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో మరో సైబర్ మోసం చోటుచేసుకుంది. క్రిప్టో కరెన్సీ పేరుతో నేరగాళ్లు రూ.33 లక్షలను దోచుకున్నారు. Read Also: దుమారం రేపుతున్న హీరోయిన్ ‘ఫస్ట్ నైట్’ కామెంట్స్ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని ఎస్సార్ నగర్‌కు చెందిన…
హైదరాబాద్ దోమలగూడలో నవ వధువు భార్గవి మిస్సింగ్ మిస్టరీ వీడింది. భార్గవి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. దోమలగూడకు చెందిన భార్గవి ఈనెల 10న సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని బయటకు వెళ్లిన ఆమె ఎంతసేపటికీ ఇంటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో కుటుంబసభ్యులు కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్గవి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. 200 సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. Read Also:…
సినీ పరిశ్రమలో ఎవరిని నమ్మలేము.. వారు ఎప్పుడు ఎలా మోసం చేస్తారో ఎవరికి తెలియదు. తాజాగా ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని ఒక వ్యక్తి దారుణంగా మోసం చేశాడు. తనను ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి మొదటి భర్తకు విడాకులిప్పించి, తన కోరిక తీర్చుకున్నాకా వదిలేశాడని జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. రహ్మత్‌నగర్‌లో నివాసముంటున్న ఒక యువతి(26) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది. ఆమెకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కొడుకు…
ప్రస్తుతం యువత విదేశీ సంప్రదాయాలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు.. పబ్ ల, క్లబ్ లు, డేటింగ్ లు ఇలా విదేశీ కల్చర్ ని పాటిస్తూ భారత సంప్రదాలను మరుస్తున్నారు. తాజాగా ఒక మహిళ పబ్ మోజులో పడి ఎంతో పవిత్రంగా చూసుకొనే మంగళ సూత్రాన్ని తీసేసింది. ఆ తరువాత అనుకోని చిక్కు వచ్చిపడింది. సరదాగా పబ్ కి వెళితే.. విలువైన మంగళ సూత్రం, నగదు పోగొట్టుకొని బయటికి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ కెమిస్ట్రీ పబ్ లో…
సంచలనం సృష్టించిన పంజాగుట్ట చిన్నారి హత్య కేసును ఛేదించారు పోలీసులు.. కన్న తల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేల్చారు.. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఖాదర్ తో కలిసి కూతుర్ని హత్య చేసింది హీనా బేగం.. మద్యానికి బానిసై పిల్లలతో బెగ్గింగ్ చేయించారు.. ఢిల్లీ, ముంబై, జైపూర్ లో పిల్లలతో బెగ్గింగ్ చేశాయించారు ఖాదర్, హీన.. చిన్నారి బేబీ మెహక్.. నేను బెగ్గింగ్ చేయను అంటూ మారం చేసింది.. నేను నాన్న దగ్గరికి వెళ్తానంటూ గొడవ చేసింది..…