భక్తి టీవీ ఆధ్వర్యంలో ఈనెల 12 వ తేదీ నుంచి నవంబర్ 22 వ తేదీ వరకు కోటి దీపోత్సవం వేడుకలను నిర్వహించారు. కోటి దీపోత్సవంలో నేడు ఆఖరిరోజు కావడంతో ముగింపు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోటి దీపోత్సవంలో భాగంగా ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు మహాదేవుడిని దర్శించుకోవడానికి ఎన్టీఆర్ స్టేడియంకు వచ్చారు.
Read: ఐపీఓకి మరో కంపెనీ ధరఖాస్తు… రూ.900 కోట్లు సమీకరణే లక్ష్యం…
కోల్హాపూర్ శ్రీ లక్ష్మీ అమ్మవారి దర్శనంతో పాటుగా మహాదేవునికి కోటి రుద్రాక్ష అర్చనను వైభవోపేతంగా నిర్వహించారు. ప్రముఖ ఆద్యాత్మిక వేత్త శ్రీ నండూరి శ్రీనివాస్ ప్రవచనామృతం చేయగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. స్వర్ణ లింగోద్భవం, సప్త హారతి దర్శనంతో వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు.