భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్ లు సంయుక్తంగా సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రీ నాయరాజ పాద మంజీర నాట్యం పేరిట నిర్వహించిన పేరిణి నాట్యం, శివ తాండవం, ఆంధ్రనాట్యం కార్యక్ర మానికి ముఖ్య అతిథిలుగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకూళా భరణం కృష్ణమోహన్ , ప్రొఫెసర్ దైజ్ఞశర్మ,ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత అధికారి, ప్రొఫెసర్ మాసన చెన్నప్పలు హాజర య్యారని ఏబీసీ ఫౌండేషన్ అధ్యక్షుడు లయన్ కె.వి. రమణారావు, భారత్ ఆర్ట్స్ అకాడెమీ అధ్యక్షురాలు లయన్ లలితారావులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ దైవజ్ఞశర్మ, ప్రొఫెసర్ మాసన చెన్నప్పలు మాట్లాడు తూ భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్‌లు వివిధ రంగాల కళాకా రులను ప్రోత్సహించే విధంగా వివిధ ప్రాంతాలలో వేదికలు ఏర్పాటు చేస్తూ వారి నృత్య కళలను ప్రదర్శిస్తూ భారతీయ సంస్కృతి సాంప్ర దాయాలను చాటే కార్యక్రమాలతో పాటు తెలం గాణా రాష్ట్ర సాంప్ర దాయ నృత్యమైన పేరిణి నృత్యాలతో తెలంగాణా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే వివిధ కార్యక్రమాలు నిర్వాహకులను కొనియాడారు.
అనంతరం ముఖ్య అతిథిలుగా హాజరైన వారు మాట్లాడుతూ ఆంధ్ర నాట్య పితామహులు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ వారి దివ్య ఆశీస్సులతో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్‌లు ప్రత్యే కంగా తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని చాటే సాంప్రదాయ నృత్యమైన పేరిణి నాట్య ప్రదర్శనలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయన్నారు. తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణా కళలను ప్రోత్సహించే విధంగా వివిధ కార్యక్రమాలు చేస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా వారు అభినందించారు.
అనంతరం నృత్య ప్రదర్శన చేసిన వారికి అవార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో గురువు పేరిణి వేణుగోపాల శర్మ, పేరిణి రచ్చ నరేష్, శ్రీమతి మృణాళిని, పేరిణి సంతోష్, పేరిణి సందీప్ తదితరులున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏబీసీ ఫౌండేషన్ అధ్యక్షులు లయన్ కె.విరమణారావు, మారుతి వరుణ్, భారత్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు లయన్ లలితరావు పర్యవేక్షించారు.