హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి దారుణం చేసుకుంది. కొంతమంది రౌడీమూకలు ఓ యువకుడిని చితకబాది గొంతుపై కత్తి పెట్టి చంపుతామని బెదిరించారు. వివరాల్లోకి వెళ్తే… సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నాగార్జున అనే యువకుడు తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో మెడిసిన్స్ కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఎల్బీనగర్ నుంచి లక్డీకాపూల్ వరకు మెట్రోలో వచ్చి మెహిదీపట్నం వరకు బస్సులో వచ్చాడు. అప్పటికే రాత్రి 10:30 గంటలు దాటడంతో మెహిదీపట్నం…
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పెరుగుతున్న సమయంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు మెట్రోరైలు అడుగుపెట్టింది. ప్రయాణికుల సమయం ఆదా చేయడం, కాలుష్యం తగ్గించడం, సౌర విద్యుత్ వినియోగం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రవేశించింది. ఈ నేపథ్యంలో తన పరుగులు మొదలుపెట్టి హైదరాబాద్ మెట్రో నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. 2017 నవంబర్ 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో రైలు తొలిదశ ప్రారంభమైంది. మొత్తం మూడు మార్గాల్లో నాలుగు దశల్లో మొత్తం…
ఏపీ, తెలంగాణలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,140గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040గా పలుకుతోంది. వెండి కూడా పసిడి బాటలో స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.700 తగ్గి ప్రస్తుతం రూ.67,200గా నమోదైంది. అటు విజయవాడలో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,140గా.. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ.45,040గా నమోదైంది. కిలో వెండి…
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ఆయన మళ్లీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆదివారం రాత్రి హుటాహుటిన అధికారులు ఆయన్ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు. ఆయన పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. Read Also: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం తొలుత ఈనెల 15న గవర్నర్ దగ్గు, జలుబు వంటి లక్షణాలతో…
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మరపురాని అనుభూతి. పెళ్లి లాంటి క్షణాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి. అందుకే కొందరు ఆ క్షణాలను గుర్తుండిపోయేలా మలుచుకుంటారు. హైదరాబాద్‌కు చెందిన దినేష్ అనే వ్యక్తి కూడా తన పెళ్లిని గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలని భావించాడు. దీంతో పాటు సామాజికంగానూ మంచి ఆలోచన చేశాడు. వివరాల్లోకి వెళ్తే… హ్యాపీ హైదరాబాద్ సైక్లింగ్ సంఘం వ్యవస్థాపక సభ్యుడు దినేష్‌కు ఇటీవల పెళ్లి కుదిరింది. దీంతో పెద్దలు ఘనంగా పెళ్లి చేయాలని…
సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి చెందడం హైదరాబాద్‌లో విషాదం నింపింది. కొండాపూర్ గౌతమి ఎన్‌క్లేవ్‌లో ఈ ఘటన జరిగింది. సెప్టిక్ ట్యాంక్ లో దిగారు నలుగురు కార్మికులు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ శ్రీను, ఆంజనేయులు అనే ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. గౌతమి ఎన్‌క్లేవ్‌లోని అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు తొలుత ఇద్దరు కూలీలు దిగారు. కాసేపటికి వారికి ఊపిరాడక అందులోనే చనిపోయారు. విషవాయువులు వెలువడటంతో చనిపోగా ..ఇది గమనించి…
మద్యం మత్తులో కన్నకొడుకు ఫై దాడి చేశాడో తండ్రి. కనికరం లేకుండా కొడుకుని చావబాదాడు. పప్పా.. పప్పా కొట్టొద్దు పప్పా . అంటూ ఓ పసి బాలుడు బ్రతిమిలాడుతూ మంచం కిందికి వెళ్లి దాక్కున్నా, తలగడ అడ్డం పెట్టుకున్నా, కూతురు వద్దు పప్పా అని ప్రాధేయపడుతున్నా కనికరించలేదు. ఆ కర్కోటక కన్న తండ్రికి హృదయం చలించలేదు. రెండున్నర నిమిషాలు ఆగకుండా చేతిలోని కట్టె విరిగేలా ఒళ్లంతా హూనం చేసిన హృదయవిదారక ఘటన పాతబస్తీ ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌పరిధిలో చోటు…
‘సిరివెన్నెల’ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని.. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సూపర్, డూపర్ హిట్ సాంగ్స్ అందించిన ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన సీతారామశాస్త్రిని వెంటనే కుటుంబసభ్యులు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.. ఆయనకు కిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది.. మరోవైపు.. సిరివెన్నెల తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వెలువడ్డాయి.. ఆ వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు.. న్యుమోనియా తోనే హాస్పిటల్లో…
దేశ ఆరోగ్య సూచిల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాలంటూ కీలక సూచనలు చేశారు మంత్రి హరీష్‌రావు.. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లడుతూ.. వైద్య రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో ఉంచాలని, ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సూచిల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉన్న జిల్లాలు పురోగతి సాధించాలన్నారు. ఆ దిశగా అధికారులు సత్వర చర్యలకు పూనుకోవాలని ఆదేశించారు హరీష్‌రావు.. ఇక, విభాగాల వారీగా అధికారులు వారి…
హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీఎస్ అధికారి పేరుతో మహిళను వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే… మ్యాట్రీమోనీలో హరిప్రసాద్ అనే యువకుడు ఐపీఎస్ పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఐపీఎస్ అధికారి అని ప్రొఫైల్ కనిపించడంతో ఆసక్తి కనపరిచిన మహిళలను హరిప్రసాద్ ట్రాప్ చేయడం ప్రారంభించాడు. అయితే ఓ మహిళకు అనుమానం వచ్చి ఐడీ కార్డు చూపించమని అడిగింది. దీంతో హరిప్రసాద్…