దేశంలో అత్యంత విషాద ఘటనగా, అతి పెద్ద పారిశ్రామిక విపత్తుగా భోపాల్ గ్యాస్ దుర్ఘటన నిలిచింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పురుగు మందుల ప్లాంట్‌లో గ్యాస్ దుర్ఘటన జరిగి (1984) నేటికి 37 ఏళ్ళు. సుమారు 8000 మందికి పైగా మృతి చెందగా 5 లక్షలకు పైగా జనాభా దీని ప్రభావానికి లోనయ్యారని ఒక అంచనా! భోపాల్ దుర్ఘటనకు యూనియన్ కార్బైడ్ యాజమాన్య నిర్లక్ష్యం, భద్రతా లోపాలే కారణమని అనేక…
కెమిస్ర్టీ పబ్‌లో పని చేసే ఓ మహిళ పై లైంగిక దాడి జరిగిందన్న విషయం మాకు తెలియదని పబ్ ఎండీ సంతోష్ మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించిన పలు విషయాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీసులు వచ్చి చెప్పేంతవరకు లైంగిక దాడి ఘటన విషయం మాకు తెలియదని ఆయన అన్నారు. లైంగిక దాడి ఘటనకు పబ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. పబ్‌లో పనిచేసే సిబ్బంది డ్యూటీ ముగించుకుని వెళ్లాక బయట…
చైనా యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఢిల్లీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అతడిని విచారణ చేస్తుంది. ఫోర్జరీ బిల్లులతో రూ.1,100 కోట్లు చైనాకు తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బోగస్ బిల్లుల జారీలో సీఏ రవికుమార్ పాత్ర కీలకంగా ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. నకీలీ చైనా యాప్‌లను ఇండియాలో ప్రవేశపెట్టేందుకు అతడు యత్నించినట్టు నాంపల్లి కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు. బోగస్ బిల్లుల జారీలో రవికుమార్…
శిల్పా చౌదరి కేసు రోజురోజుకు సంచలనంగా మారుతోంది. అధిక వడ్డీ పేరుచెప్పి టాలీవుడ్ ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టిన ఈమెను ఇటీవల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఆమెకు కోర్టు బెయిల్ కూడా నిరాకరించింది. మరోపక్క శిల్పా బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు. రెండు రోజుల క్రితం శిల్పా చౌదరి తన వద్ద రూ. 2.9 కోట్లు తీసుకొని మోసం చేసిందని మహేష్ బాబు సోదరి, హీరో సుధీర్ బాబు…
నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మసాజ్ సెంటర్ పై మల్కాజిగిరి SoT టీమ్, నేరేడ్ మెట్ పోలీసులు కలిసి దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిబంధనలకు విరుద్ధంగా నేరేడ్ మెట్ డిఫెన్స్ కాలనీలో మార్టిన్స్ వెల్నెస్ బ్యూటీ స్పా పేరుతో ఒక మసాజ్ సెంటర్ ను నిర్వహిస్తూ అందులో మహిళలతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. నేరేడ్మెట్ పోలీసులు మల్కాజిగిరి ఎల్.ఓ.టి సహాయంతో స్పా సెంటర్ పై దాడి చేసి…
హైదరాబాద్ నగరంలో శుక్రవారం నాడు కొత్తగా 32 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రతి 5 వేల నుంచి 10 వేల వరకు జనాభాకు ఒక బస్తీ దవాఖానాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో బాలానగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి హరీష్‌రావు, షేక్‌పేటలో బస్తీ దవాఖానాను మంత్రి కేటీఆర్.. దూల్పేటలో బస్తీ దవాఖానాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో ప్రజల వద్దకే…
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడిపై యువతి లైంగిక దాడి చేయడమే కాకుండా అతడిని బెదిరించి రూ.16 లక్షల సొత్తును కాజేసింది. వివరాల్లోకి వెళ్తే… టోలిచౌకీలో నివాసం ఉంటున్న కుటుంబం ఇటీవల జూబ్లీహిల్స్‌కు మారింది. అయితే ఇల్లు సద్దుతున్న క్రమంలో 20 తులాల బంగారం కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లి 9వ తరగతి చదువుతున్న కుమారుడిని ప్రశ్నించగా.. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆ బంగారం తీసింది తానేనని బాలుడు చెప్పడంతో తల్లి…
హైదరాబాద్ లో ఓ హోటల్లో విషాదం చోటుచేసుకుంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4 లో ఉన్న GIS హోటల్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న శివాజీ గణేష్ లిఫ్ట్ లో ఇరుక్కొని మృతి చెందాడు. అతని వయసు 29 సంవత్సరాలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర ముద్దం అనే తండాకు చెందిన శివాజీ గణేష్ బతుకు తెరువు కోసం 2019లో హైదరాబాద్ వచ్చాడు. బంజారాహిల్స్‌లో జీఐఎస్ హోటల్లో సూపర్ వైజర్‌గా…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో గందరగోళ పరిస్థితులతో రైతు కన్నీరు పెడుతున్నాడు.. ధాన్యం మార్కెట్‌కు తరలించినా ఎప్పుడు కొంటారో తెలియని పరిస్థితి.. మరోవైపు వర్షాలతో కల్లాలు, రోడ్లపైనే ధాన్యం తడిసిసోయి రైతులను కన్నీరు పెట్టిస్తుంది.. అయితే, వరి ఉరి కాదు.. రైతుల పాలిట సిరి అంటున్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. వరి విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించిన ఆయన.. వానాకాలం పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని.. రైతుల ఆత్మహత్యలకు…
ప్రస్తుతం టాలీవుడ్ లో శిల్పా చౌదరి చీటింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. అధిక వడ్డీ పేరు చెప్పి ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కాజేసిన శిల్పా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇటీవల ఆమె టాలీవుడ్ లోని ముగ్గురు సెలబ్రెటీలను మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అరెస్ట్ అయ్యాకా ఆ ముగ్గురు సెలబ్రెటీలు ఎవరు అనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఇక ఈ నేపథ్యంలోనే శిల్ప బాధితుల్లో చాలామంది…