తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి అంటారు. కానీ ఇప్పుడు గారెల బదులు బిర్యానీ అనాలేమో. ఎందుకంటే అందరు మెచ్చిన వంటకంగా బిర్యానీ మారిపోయింది. అందునా మన హైదరాబాద్ బిర్యానీకి మరీ క్రేజ్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు..టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. మహేశ్ నుంచి సల్మాన్ దాకా ..యాక్టర్లు క్రికెటర్లు అందరికి ఇష్టమైన వంటకం హైద్రాబాదీ బిర్యానీ. ఆర్డర్లలోనూ సరికొత్త రికార్డులు సృష్టించింది. నిమిషానికి 115 ఆర్డర్లలో టాప్ లో నిలిచింది. అందుకే ఫుడ్…
హైదరాబాద్ లోని కోకాపేట్ భూముల అమ్మకానికి కేసీఆర్ సర్కార్ అనుమతినిచ్చింది. కోకాపేట్ నియో పోలీస్ లోని భూముల వేలానికి హెచ్ ఎండీఏ కు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. 239, 240 సర్వే నంబర్ల లోని భూమి పై హక్కులు పూర్తి గా ప్రభుత్వానివేనని నిర్ధారణ అయింది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ఏజెంట్ గా హెచ్ ఎండీఏ ఈ భూముల వేలం నిర్వహించనున్నది. వేలంలో.. భూములు కొన్న బిల్డర్లకు రిజిస్ట్రేషన్లు చేయాలని రంగారెడ్డి.. కలెక్టరెట్‌కు…
టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మగా అద్భుతంగా పని చేశారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు వైద్య సదుపాయాలు కల్పించే కీలకమైన సంస్థ టీఎస్ ఎం ఎస్ ఐడీసీ, అలాంటి సంస్థకు ఛైర్మగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎర్రోళ్ల శ్రీను కు నా అభినందనలు అని వైద్యాఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.…
ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ర్టంలో కేసులు నమోదు అవ్వగా తాజాగా తెలంగాణలో మరో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్‌లో 23 ఏండ్ల యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 25కు చేరింది. హయత్‌నగర్‌కు చెందిన యువకుడు ఇటీవలే సూడాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ఒమిక్రాన్ సోకిన యువకుడిని అధికారులు గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించారు. ఈ యువకుడి…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ గా విజె సన్నీ గెలిచిన విషయం తెలిసిందే. ట్రోఫీ గెలిచి బయటికి వచ్చిన దగ్గరనుంచి సన్నీ పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో ఉన్నాడు. ఇక నిన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్ లో మీడియా ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు పాల్గొన్నాయి. ఇక ఈ కార్యక్రమంలో చిన్న అపశృతి దొర్లింది. సన్నీ చేతికి కరెంట్ షాక్ తగిలింది. సన్నీ మాట్లాడుతూ ఫోన్ లో ఒక క్లిప్పింగ్ చూపించడానికి ఫోన్ పట్టుకోగా..…
తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 726 మంది శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్నారని, వారదందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.దీంతో వారి శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 9,122 మంది ప్రయాణికులు వచ్చారు.…
సాధారణంగా పెద్ద షాపింగ్ మాళ్లకు వెళ్లే కస్టమర్లకు క్యారీబ్యాగ్స్ విషయంలో సమస్య ఎదురవుతుంది. క్యారీబ్యాగ్ తీసుకువెళ్లకపోతే అదనంగా 5-10 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. వేలకు వేలు పెట్టి సరుకులు, వస్తువులు కొనేటప్పుడు క్యారీబ్యాగ్ ఉచితంగా ఇవ్వమని కస్టమర్లు అడిగితే షాపింగ్ మాల్ నిర్వాహకులు ససేమిరా అంటారు. ఈ విషయంపై హైదరాబాద్ తార్నాకకు చెందిన ఆకాశ్‌కుమార్ వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశాడు. Read Also: సామాన్యులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు వివరాల్లోకి వెళ్తే… 2019 మే 11న…
నిధుల మళ్లింపు వ్యవహారంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు (టీఆర్ఎస్) చెందిన మధుకాన్ సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి బ్యాంకులను రూ.1064 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై ఇదివరకే సీబీఐ కేసు నమోదు చేయగా ఇప్పుడు ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నామా నాగేశ్వరరావు నేతృత్వంలోని మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ రాంచీ-జంషెడ్పూర్ల మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నాలుగు…
ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తెలుగుదేశం అధినేత, చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడారు. శత్రువులను కూడా గౌరవించమని బైబిల్ చెబుతుంటే, సొంత పార్టీ కార్యకర్తల్ని కూడా కనికరించని పరిస్థితుల్లో వైసీపీ ఉందన్నారు. తోటి వారిని ప్రేమించాలనే బైబిల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టంలో పరిపాలన కొనసాగుతుందన్నారు. ప్రశ్నించే వారిపై దాడుల్ని యేసు ప్రభువు ఆమోదిస్తారా? ఉన్నత ప్రమాణాలు పాటించే క్రైస్తవ విద్యా సంస్థలకు గ్రాంట్ నిలిపేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీదేనని ఎద్దేవా…
హైదరాబాద్ గోషామహల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గోషామహల్ లోని జింగుర్ బస్తీలో ఒక సెంట్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా ఎగిసిపడుతున్నాయి మంటలు. సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి, సహాయక చర్యలు చేపట్టారు మాజీ టీఆర్ఎస్ కార్పొరేటర్ ముకేష్ సింగ్. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షాపులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి వుంటాయని అనుమానిస్తున్నారు. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం.…